BCCI on Shreyas Iyer: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్-2025కు ఎంపిక చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెలక్టర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆసియా కప్‌కు సెలక్ట్ చేయకపోయినప్పటికీ, వన్డే జట్టు కెప్టెన్సీని అయ్యర్‌కు అప్పగించే యోచనలో బీసీసీఐ వర్గాలు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ప్రచారంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. శ్రేయస్ అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై మాట్లాడిన ఆయన, ఇవన్నీ ఊహాగానాలేనని (BCCI on Shreyas Iyer) కొట్టిపారేశారు.
అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ అప్పగిస్తారంటూ జరుగుతున్న ప్రచారమంతా ఉత్తదేనని, అవన్నీ వదంతులేనని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా ఖండించారు. ఈ వ్యవహారంపై బీసీసీఐ మేనేజ్‌మెంట్ అసలు ఎలాంటి చర్చ చేపట్టలేదని తెలిపారు. తన వద్ద న్యూస్ ఇదేనని, బీసీసీఐలో దీనిపై అసలు చర్చే జరగలేదని ఆయన పునరుద్ఘాటించారు. కాగా, ఇటీవలే ప్రకటించిన ఆసియా కప్ 2025 జట్టులో శ్రేయస్ అయ్యర్‌ను చోటు దక్కకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది.
Read Also- Ashwini Vaishnaw: రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్.. ‘లగేజీ రూల్స్’పై రైల్వే మంత్రి కీలక ప్రకటన
నిజానికి, రోహిత్ శర్మ తర్వాత వన్డే ఫార్మాట్ కెప్టెన్సీని శ్రేయస్ అయ్యర్‌కు ఇవ్వబోతున్నారని, ఈ మేరకు బీసీసీఐ మేనేజ్‌మెంట్ సిద్దమైందంటూ జాతీయ మీడియాలో జోరుగా కథనాలు వెలువడ్డాయి. కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మపై కెప్టెన్సీ భారాన్ని తగ్గించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉందని, ఇందుకు అయ్యర్ సరైన ఎంపిక అని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ కథనాలు అన్నింటినీ దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ అనే మాటను తాను తొలిసారి వింటున్నానని, అలాంటి అంశంపై తాము చర్చించలేదని ఆయన స్పష్టంగా చెప్పారు.
అయ్యర్‌కు తీవ్ర అన్యాయం
కాగా, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయర్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఆ జట్టుని ఏకంగా ఫైనల్‌కు కూడా తీసుకెళ్లాడు. అయినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో అతడికి చోటు దక్కకపోవడంపై భారత క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెలక్టర్లపై మండిపడుతున్నారు. అయ్యర్‌కు అన్యాయం చేశారంటూ సోషల్ మీడియా వేదికగానైతే ఏకీపారేస్తున్నారు.
Read Also- BCCI: సెలక్షన్ కమిటీ సభ్యులు కావలెను.. బీసీసీఐ ఆహ్వానం.. అర్హతలు ఇవే
శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్ 2025 టీమ్‌లోకి ఎంపిక చేయకపోవడంపై టీమ్ అనౌన్స్‌మెంట్ సమయంలో బీసీసీఢ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పందించారు. ‘‘ఇది శ్రేయస్ తప్పు కాదు. అలాగని, మా తప్పు కూడా ఏమీలేదు. ఎవరి స్థానంలో అతడిని తీసుకోవాలి?. 15 మందినే తీసుకోవాలి. ఆ ప్రకారమే ఎంపిక చేశాం. కాబట్, శ్రేయస్ అయ్యర్ అవకాశం కోసం ఇంకాస్త ఎదురుచూడాలి ఉంటుంది’’ అని అగార్కర్ చెప్పారు. కాగా, శ్రేయస్ అయ్యర్‌కు టీమ్‌లో చోటు ఇవ్వాల్సిందేనని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
శ్రేయస్ ఫామ్ మాత్రం అద్భుతం
శ్రేయర్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. భారత్ విజేతగా నిలిచిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి 243 పరుగులు సాధించాడు. 48.60 సగటుతో రెండు అర్ధశతకాలు కూడా నమోదు చేశాడు.
ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2025లో 17 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 604 పరుగులు బాదాడు. సగటు 50.33 పరుగులు, స్ట్రైక్ రేట్ 175.07తో బ్యాటింగ్ చేశారు. ఏకంగా 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ ట్రాక్ రికార్డు చూసుకున్నా అయ్యర్‌కు తిరుగులేదు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతడి సగటు 49.94గా , 179.73 స్ట్రైక్ రేట్‌గా ఉన్నాయి.