No Shortage of Urea: నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా(Urea) కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్(Gangadhar) అన్నారు. నగర శివారులోని ఖానాపూర్ వద్దగల గోదాంలలో నిల్వ ఉంచిన యూరియా ను ఆయన జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు(Govindh)తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. జిల్లాకు ఇప్పటికే 6700 మెట్రిక్ టన్నులు వచ్చిందని ఇంకా నాలుగు వేల టన్నులు మనకు రావాల్సి ఉన్నదన్నారు. 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా నిల్వ ఉందనీ ఎక్కడ ఇబ్బంది లేదన్నారు.
కొన్నిచోట్ల ఇబ్బందులు
ప్రతిపక్షాలు యూరియాకు సంబంధించి అనవసరంగా రాజకీయం చేస్తున్నాయన్నారు. కొన్నిచోట్ల ఇబ్బందులు ఉన్నాయని కానీ ఎక్కడ కూడా యూరియా(Urea) కొరతలేదని రైతులు భూమి కూడడం వలన మరి ఇతర కారణాల వలన ఇబ్బందులు అవుతున్నాయని వాటిని ప్రతిపక్షాలు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని రేవంత్ రెడ్డి(Reanth Reddy) ప్రభుత్వమైన బురద చల్లే కార్యక్రమం జరుగుతుందన్నారు .ఈ తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతన్నల పెన్నిధని ,రైతుల పక్షాన రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు.
Also Read: Jayashankar Bhupalapally: మోటార్లు బైకులు ట్రాన్స్‌ఫార్మర్ల దొంగ అరెస్టు!