Telangana Grameena Bank: ఓ మహిళ ఖాతాదారురాలు బ్యాంకులో దాచిన ఎఫ్డి డబ్బులను కాజేశారు. ఆ బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది అయితే తన ఖాతా పై అనుమానం రావడంతో బ్యాంకుకు వెళ్లి మేనేజర్(Bank Manger)ను సంప్రదించిన మహిళ ఖాతాలో ఉన్న డబ్బులు మాయమైన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్ శ్రీనివాస్..
తెలంగాణ గ్రామీణ బ్యాంకు
తాండూర్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Gramin Bank)లో విశాలాక్షి(Vishalakshi) అనే మహిళ ఓ ఖాతా తెరిచి ఆ ఖాతాలో తన డబ్బులను ఎఫ్డి(FD) రూపంలో జమ చేసింది. ఒక ఎఫ్ డి లో 2,84,000 .. మరో ఎఫ్డిలో 3 లక్షల 15 వేల రూపాయల చొప్పున 2 ఎఫ్ డి లకు సంబంధించి ఆరు లక్షల 4 వేల రూపాయలు ఖాతాలో జమ చేసింది. ఈ మధ్యకాలంలో ఎఫ్డి రెన్యువల్(FD Renewal) ఉండడంతో బ్యాంకు ను ఆశ్రయించింది. సదరు మహిళా ఖాతాలో నుంచి డబ్బులు డ్రా అయినట్టు మేనేజర్ తెలపడంతో ఆశ్చర్యపోయింది.
Also Read: Jagapathi Babu: ‘ఆ టాపిక్ తీసుకొస్తే.. నేను మీ టాపిక్ తీసుకొస్తా’.. జగ్గుభాయ్‌కి శ్రీలీల వార్నింగ్!
మరో ఖాతాలోకి మళ్లించి
తను డబ్బులు డ్రా(Draw) చేయలేదని ఒకసారి తన ఖాతాకి సంబంధించి లావాదేవీలను పూర్తిfrగా పరిశీలించాలని మేనేజర్ తెల్పడంతో మేనేజర్ ఖాతాను పరిశీలించడంతో విస్తీ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది కొందరు ఆమె ఖాతాలోని డబ్బులను మరో ఖాతాలోకి మళ్లించి విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది దీంతో సదర్ మేనేజర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై తాండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒక ఉద్యోగిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు డి.ఎస్.పి, బాలకృష్ణారెడ్డి తెలిపారు.
Also Read: Konda vs Congress: వరంగల్ కాంగ్రెస్‌లో మళ్లీ.. భగ్గుమన్న వర్గ విబేధాలు