Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్ల కు సత్వరమే పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు కావాల్సిన యూరియా(Urea)ను జిల్లాకు కేటాయించి సరఫరా చేయాలని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Min Komti Reddy Venat Reddy), తుమ్మల నాగేశ్వరరావు(Min Tummala Nageshwar Rao)ను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) కలిసి విన్నవించారు. హైదరాబాద్(Hyderabad) లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమై గద్వాల నియోజకవర్గంలొ 200 కిలోమీటర్ల రోడ్ల పునర్నిర్మాణానికి ప్రతిపాధనలతో కూడిన వినతిపత్రంను అందజేశారు, తక్షణమే రోడ్లను పునరుద్దరించాలన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు పాడయ్యాయని, తక్షణమే పనుల మంజూరుకు కృషి చేయాలని కోరారు. అదేవిదంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల గురించి వినతి పత్రం అందజేసారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే జిల్లాలోని రోడ్లనిర్మాణానికి మంజూరు తో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యేకి హామీనిచ్చారు.
Also Read: Minor Girl Assault Case: మైనర్ బాలికపై అత్యాచారం.. వ్యక్తికి జైలు శిక్ష.. ఎక్కడంటే!
జిల్లాకు సరిపడేంత యూరియాను కేటాయించండి
జోగులాంబ గద్వాల జిల్లాలో యూరియ కొరత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే జిల్లాకు యూరియా(Urea) కేటాయించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) అన్నారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ నందు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Min Tummala Nageshwar Rao)ను కలిసి యూరియాను కేటాయిచాలని అదే విదంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల గురించి వినతి పత్రం అందజేసారు గద్వాల అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. ఈ మేరకు మంత్రి సానుకులంగా స్పందించి త్వరలోనే జిల్లాకు తగినంత యూరియాను అదేవిదంగా మిగతా సమస్యలను పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు
గత నెల రోజులుగా రైతులకు సరిపడా యూరియా దొరకక వ్యవసాయ పనులు మానుకొని పిఎసిఎస్(PACS) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆయన మంత్రికి వివరించారు. జిల్లాకు కేవలం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారని ఇప్పటికే ఆ స్టాక్ అయిపోయిందని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వర్షాలు పడి వివిధ రకాల పంటలకు ఎరువులు అత్యవసరమని, ప్రస్తుతం జిల్లాలో యూరియాతో పాటు డిఏపి కొరత నెలకొందని, తక్షణమే ఎరువులను జిల్లాకు కేటాయించి సరఫరా చేయాలన్నారు.
Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు