TG Police: Image Source: Twitter)
తెలంగాణ

Gnanesh Mandapam Permission: గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి!

Gnanesh Mandapam Permission: దేశంలో అత్యంత వైభవంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతీ ఏటా గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తుంటారు. గ్రామాలు, పట్టణాలు, సిటీలు అన్న తేడా లేకుండా ప్రతీ గల్లీలోనూ మండపాలను ఏర్పాటు చేసి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అటు తెలంగాణలోనూ గణేష్ ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుతుంటారు. ఈ నేపథ్యంలో గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు తెలంగాణ పోలీసులు (Telangana Police Department) కీలక సూచనలు చేశారు. అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆన్ లైన్ లో అప్లై చేసుకోండి
గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తీసుకోవాల్సిన అనుమతులను తెలియజేస్తూ తెలంగాణ పోలీసులు.. ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆన్ లైన్ ద్వారా ఈ అనుమతుల కోసం https://policeportal.tspolice.gov.in/index.htm సైట్ లో అప్లై చేసుకోవచ్చని తెలియజేశారు. అలాగే మండపం నిర్మాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. విద్యుత్ కనెక్షన్ల కోసం నిపుణులను మాత్రమే సంప్రదించాలని సూచించారు.

Also Read: Lord Vinayaka Marriage: వినాయకుడికి పెళ్లి జరిగిందా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే?

ఈ సూచనలు పాటించండి!
ఆన్ లైన్ అనుమతి తీసుకోవడం పాటు.. మండపం నిర్మాణంలో పాటించాల్సి జాగ్రత్తలను సైతం తెలంగాణ పోలీసు డిపార్ట్ మెంట్ ఎక్స్ వేదికగా తెలియజేసింది. అటు పోలీసులకు సైతం కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

❄️ విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ కట్టండి
❄️ స్వంతంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దు
❄️ నిపుణులతో మాత్రమే పని చేయించండి
❄️ గాలి, వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి
❄️ పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకోండి
❄️ అనుమానస్పద వ్యక్తుల్ని గుర్తిస్తే తక్షణమే సమాచారమివ్వండి
❄️ స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోండి

Also Read: Rohit Sharma: రోహిత్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. హిట్ మ్యాన్ వచ్చేస్తున్నాడోచ్!

మరికొన్ని జాగ్రత్తలు
గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసేవారు పైన పేర్కొన్న వాటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు సైతం పాటించాలి. మండపం ఏర్పాటుకు శుభ్రమైన, సురక్షితమైన సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. గణపతి విగ్రహాన్ని పవిత్రంగా, శాస్త్రోక్తంగా స్థాపించాలి. విద్యుత్ లైట్లు, డెకరేషన్ కోసం సురక్షిత వైరింగ్ ఉపయోగించాలి. దీపారాధన, హోమం నిర్వహించే క్రమంలో అగ్ని నిరోధక సామగ్రి, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాలి. భక్తుల రద్దీని నియంత్రించడానికి వాలంటీర్లు, భద్రతా సిబ్బందిని నియమించాలి. అలాగే పర్యావరణ హితమైన విగ్రహాలు, అలంకరణలు ఉపయోగించాలి. విగ్రహాల నిమర్జనకు సురక్షితమైన పర్యావరణ హితమైన పద్ధతులను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మండపాన్ని ఇలా తీర్చిదిద్దండి!
సాధారణంగా చాలామంది సాంప్రదాయ శైలిలో గణేశ చతుర్థి మండపాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రెడిషనల్ గా మండపాన్ని తీర్చిదిద్దేందుకు ముందుగా పుష్పాలంకరణ చేయాల్సి ఉంటుంది. మండపం చుట్టూ మల్లె, గులాబీ, చామంతి, సన్నజాజి వంటి సుగంధ పుష్పాలతో అలంకరించండి. గణపతి విగ్రహం వెనుక పెద్ద పూల మాలలు లేదా రంగవల్లి ఆకారంలో డెకరేషన్ చేయవచ్చు. మండపం ఎంట్రన్స్‌లో రెండు వైపులా రంగురంగుల పూల హారాలతో అలంకరణ చేయండి. తర్వాత మండపం ఎంట్రన్స్, గణపతి విగ్రహం చుట్టూ మామిడి ఆకులు వేలాడదీయండి. వీటితో పాటు మండపం ఎంట్రన్స్‌లో గణేశుడి చిత్రాలు, శుభప్రదమైన చిహ్నాలు (స్వస్తిక, ఓం, పాదముద్రలు) లేదా పూల ఆకారంలో రంగోలి వేయండి. తర్వాత మట్టి దీపాలు లేదా ఆయిల్ లాంప్స్ మండపం చుట్టూ ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించండి.

Also Read: Chinese Woman: జైలు శిక్ష తప్పించుకునేందుకు.. గర్భాన్ని ఆయుధంగా మార్చుకున్న మహిళ.. ఎలాగంటే? 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!