Women Police Officers: మహిళలు అనగానే బలహీనులు అనే కోణంలో చూస్తారు కొందరు. వారు ఏ స్థాయిలో ఉన్న వారిని కొన్ని సందర్భాల్లో విధుల నిర్వహణ ఇబ్బందికరం అనే మానసిక స్థితిలో ఉంటారు. ముఖ్యంగా పోలీస్(Police) శాఖలో రాత్రి సమయంలో మహిళా పోలీసులకు విధులు లేకుండా చూస్తారు. కానీ ఇప్పుడు మహిళలు కూడ మేము ఎందులో తక్కువ కాదు మమ్మల్ని ఎందుకు బలహీనులుగా చూస్తారు మేము కూడా ఎందులో తగ్గేది లేదు. ఎటువంటి సవాళ్లు అయినా అధిగమిస్తామని నిరూపిస్తున్నారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ మహిళ కానిస్టేబుల్స్.
ఎలాంటి విదులైన నిర్వహిస్తామని
పోలీస్ స్టేషన్ల లో కేవలం రిసెప్షన్,(Reception) కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహించే మహిళా పోలీసులు ఇప్పుడు అన్ని రకాల విధులు నిర్వహించి మెప్పిస్తామనీ నిరూపిస్తున్నారు. వరంగల్(Warangal Police) పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మహిళలను అన్ని రకాల విధులను అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ(Hanumakonda) పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా పోలీసులు గత అర్ధరాత్రి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ మేము అన్ని విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో తగ్గేది లేదు ఎలాంటి విదులైన నిర్వహిస్తామని సవాల్ విసిరినట్టు మహిళా కానిస్టేబుల్స్ ఎలాంటి బెరుకులు లేకుండ రాత్రి సమయంలో పెట్రోలింగ్ విధులు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు పెట్రోలింగ్ విధులు నిర్వహించడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయంశంగా మారింది. ఎవర్ విక్టోరియాస్ గా పేరుపొందిన వరంగల్ పోలీసులు(Warangal Police)ఇప్పుడు మహిళా కానిస్టేబుల్స్ రాత్రి వేళల్లో వీధుల నిర్వహణతో మరో అడుగు ముందుకు వేశారనే చర్చ సాగుతుంది.
Also Read: IBPS Clerk 2025: ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2025
పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి: కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Commissioner Sunpreet Singh) అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సుధాకర్, సంపత్ కుమార్, రవీందర్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, జె. శ్రీనివాస్ , శ్రీనివాస్ రావు, రమేశ్, ప్రభాకర్, కిషన్ రావు, రవీందర్, ప్రభాకర్, కీర్తి నాగరాజు, నరేందర్, వెంకటస్వామి వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై పట్టీలను అలంకరించి అభినందనలు తెలియజేసారు. అనంతరం సీపీ(CP) మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసుల పట్ల భరోసా నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు సిపి సూచించారు.