BJP Bokka Narasimha: పార్లమెంట్‌లో బెట్టింగ్ బిల్లు ఆమోదం పొందినందుకు రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) బీజేపీ మాజీ అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి((BJP Bokka Narasimha))ఆనందం వ్యక్తం చేశారు. బెట్టింగ్(Betting)వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం అభినందనీయమన్నారు. సమాజంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ దేశ భవిష్యత్తు రక్షణలో మోదీ మరో ముఖ్యమైన అడుగు వేశారని తెలిపారు. బెట్టింగ్ రూపంలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట పడటంతో పాటు చట్టబద్ధమైన వ్యవస్థతో పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read: Rahul Sipligunj: అక్కడ రహస్యంగా పూజలు చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్.. షాక్ లో నెటిజన్స్
దేశ ప్రజలు హర్షం
ఈ బిల్లును దేశ ప్రజలు హర్షిస్తారని “ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన దైన శైలిలో తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశ యువతకు రక్షణ కలిగించే విధంగా ఒక సర్జికల్ స్ట్రైక్లా జరిగిందని అన్నారు. సమాజంలో వ్యసనాల బారిన పడుతున్న యువతను కాపాడబోతోందని, క్రీడల గౌరవాన్ని కాపాడుతుందని” కొనియాడారు. జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు(Ramachandra Ra)పర్యటన ఉందని అన్నారు. ప్రవాస్ యోజన (పల్లె పల్లెకు) బీజేపీ కార్యక్రమం చేవెళ్ల నియోజకవర్గంలో ఉందన్నారు. ఈ నెల 17 నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్నట్లు తెలిపారు.