Rahul Sipligunj: ఈ తెలంగాణ కుర్రాడు చాలా స్పెషల్. ఎందుకంటే ఒకే ఒక్క పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అలాగే, ఆస్కార్ వరకు వెళ్ళగలిగి అక్కడ స్టేజ్ మీద పాట పాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగ చైతన్య హీరోగా నటించిన ‘జోష్’ (josh ) సినిమాలోని ఓ పాటతో మన ముందుకు వచ్చాడు. అలా వరుస అవకాశాలను అందిపుచ్చుకుని, ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో మాస్ పాటలతో ఫేమస్ అయ్యాడు. ఇవి మాత్రమే కాకుండా.. యూట్యూబ్‌లో ప్రైవేట్ పాటలతో ప్రేక్షకులను అలరించాడు. అలా రాహుల్ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొంది ఎన్నో అవార్డులను పొందాడు.
పాటల ఫేమ్ తో తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ‘సీజన్-3’లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. అంతేకాకుండా రాజమౌళి సినిమాలో అవకాశం కొట్టేసి ‘ఆర్ఆర్ఆర్'(RRR) లో నాటునాటు పాటతో స్టార్ గా మారిపోయాడు. ఈ సాంగ్ కి ఆస్కార్ అవార్డు కూడా రావడంతో పాటు రాహుల్ పాపులారిటీ పెరిగిపోయింది.
ఇటీవల రాహుల్ తన ప్రియురాలు హరణ్య రెడ్డితో ఆగస్టు 17న జరిగిన నిశ్చితార్థంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ గ్రాండ్ ఈవెంట్ కు సినీ సెలబ్రిటీలు సహా పలువురు హాజరయ్యారు. రాహుల్ షేర్ చేసిన ఎంగేజ్మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ జోడీకి శుభాకాంక్షల వర్షం కురిపించారు. అంతేకాదు, రాహుల్ తన ప్రియురాలికి ఖరీదైన బహుమతితో సర్ప్రైజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, తాజాగా రాహుల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కన్యాకుమారి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “నిశ్చితార్థం జరిగిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి పూజలు ఎందుకు? ఏమైనా దోషాలు తొలగించడానికా?” అంటూ చర్చిస్తున్నారు. రాహుల్ ఈ విషయంపై ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.