Students Protest( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Students Protest: బస్సు సౌకర్యం కల్పించాలని వీర్నపల్లి కేంద్రంలో విద్యార్థుల ఆందోళన

Students Protest: బస్సు సౌకర్యం కల్పించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా(Sircilla District) వీర్నపల్లి కేంద్రంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్ ఎఫ్ ఐ( SFi) ఆధ్వర్యంలో విద్యార్థులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సమయానికి బస్(bus) సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరిన విద్యార్థులు వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆర్టీసీ(RTC)అధికారులు ఫోన్ లో మాట్లాడి హామీ ఇవ్వడంతో విద్యార్థులు(students) ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వీర్నపల్లి(Veernapally)మండల కేంద్రంలో బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు (students) ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

విద్యార్థులు రాస్తారోకో, ధర్నా

మండల కేంద్రంలోని మానేరు స్కూల్ ప్రభుత్వ హైస్కూల్‌, మోడల్ స్కూల్ కు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు(students)బస్సు(bus)ఆలస్యంగా రావడం, సకాలంలో సరిపడ బస్సులు రాకపోవడంతో క్లాసులు మిస్ అవుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు రవి మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా పోలీసులు కేసులు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

బస్సు సౌకర్యం కల్పించాలి

అక్రమ కేసులు పెట్టినా సరే, విద్యార్థుల ప్రయాణ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుంది అని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. విద్యార్థినులు మాట్లాడుతూ బస్సు సమయానికి రాకపోవడంతో మేము తరగతులు మిస్ అవుతున్నాం. ఆలస్యంగా స్కూల్‌కి చేరుకుంటే టీచర్లు బయట నిలబెడుతున్నారు. దయచేసి మాకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. విద్యార్థుల(students)సమస్యను అధికారులు సీరియస్‌గా తీసుకుని, తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.

 Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!