Remal Cyclone Effect On West Bengal And Bangladesh
జాతీయం

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాను కారణంగా పశ్చిమబెంగాల్‌తో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టించింది. రెండురోజుల క్రితం తుపాను తీరం దాటడంతో బెంగాల్‌ భయంతో వణికిపోయింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దాంతో బెంగాల్‌ వ్యాప్తంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి సెంట్రల్‌ కోల్‌కతాలోని ఎంటాలికి చెందిన బిబిర్‌ బగాన్‌ ప్రాంతంలో గోడ కూలి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో సుందర్‌బన్‌ డెల్టాకు ఆనుకుని ఉన్న నమ్‌ఖానా సమీపంలోని మౌసుని ద్వీపంలో ఓ పూరిల్లుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఓ వృద్ధ మహిళ తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అదే విధంగా వివిధ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో మరో నలుగురు మృతిచెందారు. కోల్‌కతాలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 5.30 వరకు 14.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రెమాల్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు నీట చిక్కుకున్నాయి. సోమవారం ఉదయం 5 గంటల నుంచి రెమాల్‌ బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హావ్‌డా, హుగ్లీ జిల్లాల్లో రాష్ట్ర, జాతీయ విపత్తు దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Also Read:వికసిత్ కాదు విద్వేషిత్

నేల కూలిన వృక్షాలను తొలగించి ప్రధాన రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించాయి. అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో రైళ్లు, మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెమాల్‌ నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో కృషి చేసిన అధికార బృందాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. రెమాల్‌ తుపాను కారణంగా బెంగాల్‌ సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.బంగ్లాదేశ్‌ తీరప్రాంతంపై రెమాల్‌ తుపాను తీవ్రంగా విరుచుకుపడింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, కుంభవృష్టితో బరిసాల్, భోలా, పతువాఖాలీ, సఖ్తీరా, ఛట్టోగ్రామ్‌లలో వందలాది గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. తుపాను కారణంగా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. వందలకొద్దీ విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కోటీ యాభై లక్షల మందికి గంటల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ