War 2 Climax ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

War 2 Climax: ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు వార్ 2 క్లైమాక్స్ మార్చారా?

War 2 Climax: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ ‘వార్ 2’. ఇటీవల రిలీజైన అయిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లతో సందడి చేసింది. యాక్షన్ సీన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నప్పటికీ, కథ అంతా రొటీన్‌గా అనిపించడంతో సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టడంతో, తెలుగు ఆడియెన్స్ లో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా బాలీవుడ్ బజ్ ప్రకారం, ‘వార్ 2’ క్లైమాక్స్‌ను ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా మార్చారట. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ, తాను వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఒప్పుకోలేదని, కానీ నిర్మాత ఆదిత్య చోప్రా తన వెనక తిరిగి, “ఫ్యాన్స్‌కు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతాం” అని ఒప్పించారని చెప్పారు.

Also Read: Chiranjeevi Birthday Special: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ‘స్టాలిన్’ రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

సినిమా కథ ప్రకారం, క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ పాత్ర చనిపోయినట్లు చూపించారు. ఇది కథకు సరిగ్గా సరిపోతుంది. కానీ, తెలుగు ఫ్యాన్స్ హీరో చనిపోవడాన్ని ఒప్పుకోరనే విషయం తెలిసినందున, చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ పాత్ర బతికే ఉంటుందని, చనిపోయినట్లు అబద్ధం చెప్పినట్లు చూపిస్తూ, ఎన్టీఆర్-హృతిక్ కలిసి కొన్ని రహస్య ఆపరేషన్స్ చేస్తున్న సన్నివేశాలతో సినిమాను ముగించారు.

Also Read: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇక గాల్లో తేలిపోండి.. రి రిలీజ్ కి రెడీ అవుతున్న ఆ హిట్ సినిమా?

గతంలో తెలుగు సినిమాల్లో హీరో చనిపోవాల్సిన సీన్స్ ను ఫ్యాన్స్ కోసం మార్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ‘వార్ 2’ లోనూ ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది. మొదట కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్ పాత్ర చనిపోతుందని చెప్పారు, కానీ ఆ తర్వాత అభిమానుల కోసం కథను మార్చారు.

Also Read: Vinayaka Chavithi 2025: వినాయకుడి మండపాన్ని ఎలా అలంకరించాలో తెలియట్లేదా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

అంతేకాదు, YRF స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్‌కు సోలో చిత్రంగా ఉంటుందనే వార్తలు బాలీవుడ్‌లో హల్చల్ చేస్తున్నాయి. ‘వార్ 2’ చివర్లో ఈ సోలో సినిమాకు సంబంధించిన హింట్‌ను ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చారట. ఈ కారణంగానే ఎన్టీఆర్ పాత్రను బతికే ఉన్నట్లు చూపించినట్లుగా సమాచారం. ఏది ఏమైనా, ఎన్టీఆర్ పాత్ర, ఆయన యాక్షన్ సన్నివేశాలపై అభిమానులు మాత్రం పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. ఈ సినిమా ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలిచింది.

Also Read:  Jammulamma kalyanotsavam: వైభవంగా జములమ్మ కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!