Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన జల్సా సినిమా 2008 ఏప్రిల్ 1న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. పవన్ కళ్యాణ్ (సంజయ్ సాహు పాత్రలో) అద్భుతంగా నటించాడు. ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ హీరోయిన్లుగా నటించారు. ముకేష్ రిషి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించారు.
జల్సా 2008లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటి రోజు వసూళ్లలో అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు టైటిల్ సాంగ్ “జల్సా”, “మై హార్ట్ ఈజ్ బీటింగ్”, “చలోరే చలోరే”, “గాల్లో తేలినట్టుందే” పాటలు ప్రేక్షలను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికి తెలుసు. ఈ ఆడియో రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ 90 లక్షలకు కొనుగోలు చేసింది. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 33 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది, అయితే కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల కంటే తక్కువకే అమ్ముడైంది. సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, హాస్యం, త్రివిక్రమ్ సంభాషణలు, సంగీతానికి ప్రశంసలు అందుకుంది. సినిమా అంత పెద్ద హిట్టైనా స్క్రీన్‌ప్లే పై కొంత విమర్శలు వచ్చాయి. అయితే, ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మేకర్స్ ఎగిరిగంతేసే న్యూస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా (సెప్టెంబర్ 2, 2025) న జల్సా 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ కాబోతోంది.