Farmers Protest(image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Farmers Protest: గద్వాల జిల్లాలో యూరియా నిల్.. విసుగెత్తి రోడ్డెక్కిన రైతులు

Farmers Protest: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల(Farmers)కు యూరియా అత్యవసరమైంది. అయితే గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు యూరియా కోసం రైతులు తిరుగుతున్నారు ప్రతిరోజు అధికారులు యూరియా లేదని త్వరలో వస్తుందని చెప్తూ రైతుల(Farmers)ను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు(Farmers) అంబేద్కర్ చౌక్ లోని పిఎసిఎస్ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.

 Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో విషాదం.. అక్క కోసం వెళ్లి బాలుడి మృతి

రైతులకు కష్టాలు

ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకుడు బాస్ హనుమంతు రైతుల(Farmers)కు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఎరువుల కొరత లేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రైతుల(Farmers)కు అవసరమైన యూరియా ప్రభుత్వం సరఫరా చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ధర్నా దగ్గరికి చేరుకున్న పోలీసులు, ఆర్డిఓ, డిఎస్పి ఎంఆర్ఓ రైతులతో మాట్లాడి వారిని శాంతింప చేశారు. రైతు(Farmers)లందరికీ యూరియా అందే విధంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు రైతుల(Farmers)కు తెలియజేయడంతో వారు ధర్నా విరవించి వెళ్ళిపోయారు. గత 10 సంవత్సరాలుగా యూరియా కొరత లేదని ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో యూరియా కొరత కారణంగా రైతులు(Farmers) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

యూరియా స్టాక్ నిల్

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం యూరియా స్టాక్ అందుబాటులో లేదు. జిల్లాకు 15 వేల మెట్రిక్ టన్నులు ఇవ్వగా ప్రస్తుతం ఆ స్టాక్ అయిపోవడంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోడు రేపు వస్తుంది అంటూ అధికారులు కార్యాలయానికి వచ్చిన రైతుల(Farmers)కు సూచిస్తున్నారు.

 Also Read: Gadwal district Rains: గద్వాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల ఆవస్థలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!