Indian Railways: పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఫైనే!
Indian Railways (Image Source: Twitter)
జాతీయం

Indian Railways: రైల్వేలో కొత్త రూల్స్.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఫైనే.. ఇవిగో నిబంధనలు!

Indian Railways: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేకు పేరుంది. నిత్యం కోట్లాది మంది ప్రజలు రైళ్ల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. దీంతో స్టేషన్లు నిత్యం రద్దీగానే కనిపిస్తున్నాయి. రైళ్ల సామర్థ్యానికి మించి ప్రజలు ప్రయాణిస్తుండటంతో బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. అటు రైల్వే స్టేషన్లు సైతం జనసందోహంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్లలో నెలకొంటున్న గందరగోళాన్ని తగ్గించి.. కార్యకాలపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎయిర్ పోర్ట్ తరహా నిబంధనలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద దేశంలో తొలుత ప్రయాగ్ రాజ్ స్టేషన్ లో ఈ రూల్స్ తీసుకొని రావాలని భావిస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కాన్పూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా స్టేషన్లలో ఈ రూల్స్ అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

కొత్త నిబంధనల్లో ఏముంటాయి?
రైల్వేలో తీసుకురాబోతున్న ఎయిర్ పోర్ట్ తరహా రూల్స్ కు సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిలో ప్రయాణికుల లగేజీ అతి ముఖ్యమైన రూల్ గా ఉంది. దీని ప్రకారం రైల్వే స్టేషన్లలోకి వచ్చిన ప్రయాణికులు.. తమ లగేజ్ ను ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ల ద్వారా స్కాన్ చేసి బరువును కొలవాల్సి ఉంటుంది. టికెట్ తరగతిని బట్టి లగేజ్ పరిమితి అమల్లోకి తీసుకొస్తారు.

ఏసీ ఫస్ట్ క్లాస్: గరిష్టంగా 70 కిలోల వరకు

ఏసీ టూ టైర్: గరిష్టంగా 50 కిలోల వరకు

ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్: గరిష్టంగా 40 కిలోల వరకు

జనరల్ క్లాస్: గరిష్టంగా 35 కిలోల వరకు

పైన పేర్కొన్న దానికి మించి లగేజ్ బరువు ఉంటే లేదా అతిపెద్ద సైజ్ ఉన్న లగేజ్ తీసుకువస్తే జరిమానా లేదా అదనపు చార్జీలు విధించే అవకాశం ఉంది. లగేజ్ చెక్ పూర్తైన తర్వాత మాత్రమే ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌లోకి అనుమతించబడతారు.

ఆధునిక సదుపాయాలు
ఎయిర్ పోర్ట్ తరహా నిబంధనలతో పాటు ఆ స్థాయి సౌఖర్యాలను కూడా కల్పించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా స్టేషన్లలో ప్రీమియం సింగిల్ బ్రాండ్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేయనుంది. వీటివల్ల ప్రయాణికులకు సౌలభ్యం పెరగడంతో పాటు స్టేషన్ల రూపురేఖలు ఆధునికంగా, ఎయిర్‌పోర్ట్ తరహాలో కనిపిస్తాయి.

ఏ స్టేషన్లలో అమలు అవుతాయి?
మొదటగా ఈ కొత్త నిబంధనలు ఉత్తర మధ్య రైల్వే జోన్ పరిధిలోని స్టేషన్లలో అమలు చేయనున్నారు. వీటిలో ప్రయాగ్‌రాజ్ జంక్షన్ (Prayagraj Junction), ప్రయాగ్‌రాజ్ చిహోకి (Prayagraj Chheoki), సుబేదార్‌గంజ్ (Subedarganj), కాన్పూర్ సెంట్రల్ (Kanpur Central), మీర్జాపూర్ (Mirzapur), టుంద్లా (Tundla), అలీగఢ్ జంక్షన్ (Aligarh Junction), గోవింద్‌పురి (Govindpuri), ఎటావా (Etawah) స్టేషన్లు ఉన్నాయి.

ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లో ప్రత్యేక మార్పులు
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఇప్పటికే ప్రయాగ్‌రాజ్ స్టేషన్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 2026 డిసెంబర్ తర్వాత నుంచి ఈ స్టేషన్ లో అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా ఫ్లాట్ ఫామ్ టికెట్ తీసుకోవాల్సిందే. లేదా ట్రైన్ టికెట్ ఉన్నా సరిపోతుంది. ప్రయాణికులను వదిలిపెట్టేందుకు లేదా తీసుకెళ్లేందుకు వచ్చే వారు మాత్రం ప్లాట్‌ఫారమ్ టికెట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Also Read: Vice President Election: ఎవరి బలం ఎంత?.. సౌత్ నేతలకు ప్రాధాన్యంపై తీవ్ర చర్చ

ప్రయాగ్ రాజ్ స్టేషన్ లో సౌఖర్యాలు
ప్రయాగ్ రాజ్ స్టేషన్ పునర్నిర్మాణం పూర్తయ్యాక అక్కడ ప్రయాణికులను అనేక సౌకర్యాలు సర్ ప్రైజ్ చేయనున్నాయి. విశాలమైన వేచి వుండే లాంజ్(Waiting lounge), హై-స్పీడ్ వైఫై, సోలార్ ఎనర్జీ వ్యవస్థలు, ఆటోమేటెడ్ టికెట్ వెండింగ్ మెషీన్లు (Automated ticket vending machines), డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేలు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు స్టేషన్ లో కనిపించనున్నాయి.

Also Read This:BRS Party: బీఆర్ఎస్‌లో జూబ్లీహిల్స్ టెన్షన్.. సర్వేలకే పరిమితం.. గ్రౌండ్‌లోకి దిగేదెప్పుడు?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..