Jammulamma kalyanotsavam: నడిగడ్డ ప్రజల ఇలవేల్పు శ్రీ జమదగ్ని సమేత జములమ్మ అమ్మ వారి కళ్యాణోత్సవం(Jammulamma kalyanotsavam) అంగరంగావైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Gadwal MLA Bandla Krishna Mohan Reddy) దంపతులు అమ్మవారికి సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా శ్రావణమాసం చివరి పురస్కరించుకొని పచ్చటి పందిరిలో లోక జనని జమదగ్ని సమేత శ్రీ జమ్ములమ్మ అమ్మ వారి కళ్యాణోత్సవము కళ్యాణం కమనీయం మంగళ వాయిద్యాలతో నిర్వహించడం జరిగింది.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు
అమ్మవారికి ప్రత్యేక పూజలు
కళ్యాణోత్సవ సందర్భంగా శ్రీజమ్ములమ్మ అమ్మ వారిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ సరిత దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి జి. వేణుగోపాల,మాజీ ఎంపీపీలు విజయ్ , రాజారెడ్డి , మాజీ ఛైర్మన్ సతీష్, మాజీ కౌన్సిలర్ మురళి, శ్రీను ముదిరాజ్, ఆలయం కమిటీ డైరెక్టర్స్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జమ్మిచేడు సురేష్, డిటిడిసి నర్సింహులు, భాస్కర్ యాదవ్, జమ్మిచేడు ఆనంద్,నాగరాజు,పాతపాలెం ఆనంద్ గౌడ్,డి.ఆర్.శ్రీధర్, టిఎన్ఆర్ జగదీష్, కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి, వెంకటేష్,బిల్డర్ రామకృష్ణ, చేపల చిన్న,దడవాయి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో విషాదం.. అక్క కోసం వెళ్లి బాలుడి మృతి