Gadwal District: ఆ జిల్లాలో విషాదం.. అక్క కోసం వెళ్లి బాలుడి మృతి
Gadwal District (image CREDIT: Swetcha reporter)
నార్త్ తెలంగాణ

Gadwal District: గద్వాల జిల్లాలో విషాదం.. అక్క కోసం వెళ్లి బాలుడి మృతి

Gadwal District: స్కూల్ కి వెళ్ళిన అక్క ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న తమ్ముడు సాయంత్రం కావడంతో బస్సు గ్రామానికి రాగా తన అక్కను ఇంటికి తీసుకురావడం కోసం వెళ్ళి అదే బస్సు కింద బాలుడు మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal District) ఇటిక్యాల మండలం శనగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కోసం వెళ్ళాడు.. అంతలోనే ఆ విద్యార్థిని మృత్యువు బస్సు రూపంలో కబళించింది. స్కూల్ బస్సులో తన అక్క వస్తుందని వెళ్లిన నిమిషాలలోనే ఆ విద్యార్థి మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శనగపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేష్, పద్మిని దంపతులకు కూతురు తనిష్క, కుమారుడు రేవంత్ ఉన్నారు. వీరిద్దరూ శాంతినగర్ పట్టణంలో సరస్వతి ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ బస్సులో వెళ్తూ చదువుకుంటున్నారు. రేవంత్ నర్సరీ చదువుతుండగా ఆ బాలుని అక్క తనిష్క ఎల్. కి. జి చదువుతోంది. అక్క తోడుగా ఉండడంతో రేవంత్ ను సైతం ఈ సంవత్సరమే నర్సరీలో జాయిన్ చేయించారు.

Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

అక్క కోసం బస్సు దగ్గరికి

శాంతినగర్(Shantinagar)లోని సరస్వతి స్కూల్ లో చదువుతున్న రేవంత్  పాఠశాలకు వెళ్లలేదు. బాలుని అక్క తనిష్క మాత్రమే పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం కావడంతో అక్కను బస్సు దగ్గర నుంచి తీసుకురావడానికి నానమ్మ తో కలిసి వెళ్ళాడు. ఎంతో సంతోషంతో అక్క బస్సు నుంచి దిగుతుండగా చూసి మురిసిపోయిన రేవంత్ ఆ తర్వాత ప్రమాదవశాత్తు బస్సు వెనుక నుంచి వస్తున్నాడు. అంతలోనే డ్రైవర్ అజాగ్రత్తగా బస్ రివర్స్ తీసుకుంటుండగా రేవంత్(Revanth)తలపై టైర్ బలంగా తాకడంతో అప్పటికే చెవులు నోట్లో రక్తం కారింది. నాడీ వ్యవస్థ పని చేయడంతో హుటాహుటిన సమీపంలోని శాంతినగర్ కు తరలించారు. బాలుని పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ కు తీసుకెళ్లాలని సూచించారు.

దూర ప్రయాణంలో మెరుగైన ప్రాథమిక చికిత్స సౌకర్యాలు లేకపోవడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రి తీసుకెళ్లినా బాలుడు మృత్యువాత పడ్డాడు. ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చిన్ననాటి నుంచే విద్య కోసం ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తుండగా మృత్యువు రూపంలో బస్సు కిందపడి చనిపోవడంతో రేవంత్ తల్లిదండ్రులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్లే విద్యార్థి మృతి చెందాడని శాంతినగర్ లో విద్యార్థి మృతదేహంతో క్రాంతి దళ రాష్ట్ర నాయకులు నాగేష్ యాదవ్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న తదితరులు బాలిని కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. స్కూల్ బస్సు కు డ్రైవర్ తో పాటు క్లీనర్ తప్పనిసరిగా ఉండాలని, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే బాలుడు మృతి చెందాడని, పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకొని బాలుని కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

 Also Read: Jogulamba Gadwal district: గద్వాల జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!