Srinivas Goud ( image CREDIT: SWETCHA REORTER)
Politics

Srinivas Goud: ఎప్పుడూ అబద్ధాలే మాట్లాడతారా?.. కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

Srinivas Goud: ఎన్నికలప్పుడు అబద్దాలే.. ఇప్పుడు అబద్దాలేనా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) మండిపడ్డారు. ఎన్నికల్లో గౌడ్లకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆ హామీల అమలు గురించి మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వృత్తి కులాలకు ఏవైనా వరాలు ప్రకటిస్తారని ఆశించారన్నారు. కానీ ఎక్కడకు వెళ్లినా కేసీఆర్‌ను తిట్టడమే ఎజెండా‌గా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 Also Read: Minister Uttam Kumar Reddy: వరద ఉధృతిని పర్యవేక్షించాలి.. నష్ట నివారణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

గౌడలకు 25 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు

కేసీఆర్(KCR) 50 శాతం లోపు రిజర్వేషన్లకు చట్టం తెచ్చారని అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‘(KCR) 62 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నించారని, సుప్రీం కోర్టు వెళ్లి దాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు స్వప్నా రెడ్డి, గోపాల్ రెడ్డి సుప్రీం కోర్టు వెళ్లి రిజర్వేషన్లకు యాభై శాతం క్యాప్ విధించేందుకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే అబద్దాలను నమ్మెందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఈ 20 నెలల్లో 700 మంది గీత కార్మికులు వివిధ ప్రమాదాల్లో మరణించారని వారికి ఎక్స్ గ్రేషియా కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాపుల్లో గౌడలకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీ‌ఆర్‌ఎస్ నేత గౌతం ప్రసాద్ పాల్గొన్నారు.

 Also Read: Brahmanandam: నా దృష్టిలో అందమైన హీరో ఎవరో తెలుసా?.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!