Brahmanandam: స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌లో ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేదు. అందుకే, ఇందులో ఉన్న కంటెంట్ అందరికీ తెలియాలని ఆర్. నారాయణ మూర్తి మరోసారి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలోని మంచి వ్యక్తులు నాలుగు మాటలు చెబితే, బాగుంటుందని భావించిన మూర్తి.. త్రివిక్రమ్ శ్రీనివాస్, బ్రహ్మానందం వంటి వారికి స్పెషల్‌గా షో వేసి చూపిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చూసిన త్రివిక్రమ్ ఎలా రియాక్ట్ అయ్యారో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా చూసిన బ్రహ్మానందం.. తన మనసులో మూర్తిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడుతూ.. యూనివర్శిటీ అంటే ఏమిటి?.. యూనివర్స్ అంటే విశ్వం. అంటే అన్ని గోళాల తోటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి భూమి లాంటి గ్రహమే కాకుండా.. విశ్వాంతరాళాలలోని గ్రహాలన్నింటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటటువంటిది ఆలయం. అదే విశ్వవిద్యాలయం, అదే యూనివర్సిటీ (University Paper Leak). అటువంటి యూనివర్సిటీలు ఇప్పుడు ఎలా మారాయో చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి అందులో రీసెర్చ్ చేసి అందులో జరుగుతున్న అవినీతిని ఆర్. నారాయణ మూర్తి చెప్పారు. అప్పట్లో విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విద్యాలయం అని పెద్ద పేరు. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మనదేశం వచ్చి చదువుకొని వెళ్లిపోయేవారు. అంటే అంత జ్ఞాన సంపద ఉన్న దేశం మన భారతదేశం. ఈవాళ మన దేశం, మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా వుంది? విద్యా వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయి? అని వాటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి.. అవన్నీ తట్టుకోలేక అంటే బ్రీత్ తీసుకోలేక.. దీన్ని నా మిత్రులకు, నా వాళ్లకు ఎలాగైనా పంచి పెట్టాలని ఈ సాహసానికి పూనుకున్నారు. ఎందుకంటే, నారాయణ మూర్తి తేనెటీగ లాంటి మనిషి. తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు.. అన్ని చోట్ల తేనె పోగుచేసుకొని వచ్చి తలా ఒక చుక్క పంచిపెట్టాలి అనేటటువంటి మహా సంకల్పం ఉన్న మంచి మనిషి అతను.
Also Read- Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేబుల్ వైర్లపై స్పందించిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
నన్ను ఎవరైనా.. మీకు అందమైన హీరో ఎవరు? అని అడిగితే నేను నారాయణ మూర్తి పేరే చెబుతాను. అందం అంటే అది గ్లామర్, 6 ఫిట్స్ హైట్, కర్లింగ్ హెయిర్ అలాంటి అందం కాదు. మదర్ థెరిస్సాని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా? మీకు అందంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరమ్మా? అని అడిగితే ఎవరి మనస్సులో సేవా భావం వుంటుందో, ఎవరి కళ్ళల్లో దయా గుణం వుంటుందో ఆ వ్యక్తి, ఆ జీవి అందంగా వుంటుందని చెప్పింది. దాదాపు నలభై సంవత్సరాల నుండి నాకు తెలిసిన నారాయణ మూర్తి నిరంతరం ప్రజలు, ప్రజలు అందునా పేదవాళ్లు పేదవాళ్లు, వారు పడుతున్న కష్టాలు.. వారు పడుతున్న భాధలు, నటుడుగా నటించడం కాకుండా ఒక మెసేజ్ అనేది ప్రపంచానికి ఇవ్వాలి అనేటటువంటి వ్యక్తి నారాయణ. నేను థియేటర్‌లో ప్రివ్యూ చూసి చాలాకాలం అయ్యింది. నా సినిమాలు కూడా చూడను. ఆ విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా ఎందుకు చూడాలి అనుకున్నాను అంటే.. దర్శకుడు వేరు, నిర్మాత వేరు, టెక్నీషియన్స్ వేరు. ఆ 24 శాఖల పని అంతా ఒక్కడే కాడి మోసి.. తాను చెప్పాలనుకున్నది అద్భుతంగా సినిమా తీసి చూపించాలనుకుంటాడు. ఎందుకంటే అది మీకోసం ప్రజలకోసం పేద ప్రజలకోసం.
Also Read- Jagapathi Babu: ‘ఆ టాపిక్ తీసుకొస్తే.. నేను మీ టాపిక్ తీసుకొస్తా’.. జగ్గుభాయ్‌కి శ్రీలీల వార్నింగ్!
ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఒక్కటే అనిపించింది.. ఇందులో అద్భుతమైన ఎమోషన్ వుంది. తండ్రీ కొడుకు, తండ్రీ కూతురు.. ఆ తండ్రి చదివించి చదివించి ఆ తండ్రి చేసిన త్యాగం, అలాగే ఆ కొడుకు తండ్రి కోసం చేసిన త్యాగం… ఇలాంటి ఎమోషన్స్ అన్నింటినీ ఒకచోటకు తీసుకొచ్చి, ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్‌తో ఈ సొసైటీ ఆడుకుంటుందో చెప్పే ప్రయత్నం నారాయణ మూర్తి చేశారు. నారాయణ మూర్తి చేసిన మంచి పనులు నేను చేయలేదు.. చేస్తానో లేదో కూడా తెలీదు. నిలువెత్తు మంచి మనిషి ఆయన. ఒక సినిమా హిట్ అయితే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలుసు.. రెండు సినిమాలు ఆడితే ఎలా ప్రవర్తిస్తున్నామో తెలుసు.. ఒక దశాబ్ద కాలం సినిమాల్లో నటిస్తే ఎలా ప్రవర్తిస్తామో తెలుసు.. అలాంటిది నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన్ని ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా నో చెప్పాడు. స్టార్స్‌ని పెట్టి ఆయన సినిమాలు చేయలేదు. ఆ రోజుల్లో నారాయణ మూర్తి సినిమా అంటే జనాలు తండోపతండలుగా వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఇష్టం.. నారాయణమూర్తి అంటే ఇష్టమని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు