Uttam Kumar Reddy
తెలంగాణ

Minister Uttam Kumar Reddy: వరద ఉధృతిని పర్యవేక్షించాలి.. నష్ట నివారణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

సత్వరమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి
నిరంతర సాగునీటి సరఫరాచేయాలి
నష్ట నివారణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

Minister Uttam Kumar Reddy: భారీ వర్షాలు కురుస్తుండటం.. కృష్ణా,గోదావరి నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపధ్యంలో నీటిపారుదల శాఖాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. వరదల ఉధృతికి ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే పూడ్చివేత చర్యలు చేపట్టాలన్నారు. జల సౌధాలో మంగళవారం నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నీటి ప్రవాహాలతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు అన్ని నింపాలని ఆదేశించారు. దీంతో రైతాంగానికి సంవత్సరం పొడవునా నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు, నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులను బుధవారం సందర్శించి అధికారులతో సమీక్షించనున్నట్లు వెల్లడించారు. కృష్ణా బేసిన్‌లో నీటి ప్రవాహాలు గణనీయమైన స్థాయికి చేరుకున్నాయని, జూరాలలో 2.18 లక్షల క్యూసెక్కులు, నాగార్జున సాగర్‌లో ఔట్ ఫ్లో 3.95 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో గతేడాది ఇదే రోజుకు 192.97 టీ.ఎం.సీలు ఉండగా, ఈ సంవత్సరం 198.81 టీఎంసీల నీరు చేరిందన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోనూ 312.05 టీఎంసీ ల నీటి సామర్ధ్యానికి గాను ఇప్పటికే 297.15 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నాయన్నారు. మరోవైపు తాజా వర్షాలకు గోదావరి బేసిన్‌లో కుడా భారీగా నీటి ప్రవాహాలు నమోదైనట్లు ఆయన వివరించారు.

Also Read- Barabar Premistha: చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘గుంజి గుంజి’ పాట విడుదల.. అది అసలు డ్యాన్సేనా?

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 90.30 టీఎంసీల నీటి సామర్ధ్యానికి గాను 73.37 టీఎంసీల నీరు చేరిందని, సింగూర్ ప్రాజెక్టులోనూ 19.48 టీఎంసీ ల నీటితో నిండిదన్నారు. రాష్ట్రంలో 34,740 చెరువులు, కుంటలు ఉండగా 12,023 చెరువుల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండగా 9,100 లలో 75 నుంచి శాతానికి నీరు చేరుకుందన్నారు. సాగునీటికి సమృద్ధిగా నీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటి నిర్వహణ చేపడుతున్నామన్నారు. వర్షాలతో దెబ్బ తిన్న 177 చెరువులు, కాలువలు, లిఫ్టుల పునరుద్ధరణకు 335 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 3,500 చోట్ల తాత్కాలికంగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. శాశ్వతంగా పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Also Read- CM Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్, జగన్‌, పవన్‌లకు సీఎం రేవంత్ ఒక విన్నపం

అదే సమయంలో నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. వానాకాలం పంటకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకు అధికారులు ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటికి 388 టీఎంసీల నీటి అవసరం ఉందని గుర్తించామన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని జిల్లా స్థాయి అధికారులకు సూచించారు. యాసంగికి సాగు నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు గోదావరి జలాలను ఆయా రిజర్వాయర్ లలో నిలువ ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కడెం, ఎల్లంపల్లితో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో సమృద్ధిగా నీటిని నిలువ ఉంచడం ద్వారా సంవత్సరం పొడవునా సాగునీరు అందించేందుకు వాటికి అనుబంధంగా ఉన్న చిన్న నీటిపారుదల చెరువులు అన్నింటిని నింపాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబు, సీఈ లు, ఎస్ఈ లు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?