Viral Video: ఈ భూమిపైన ఉన్న ప్రమాదకర జీవుల్లో సర్పాలు ఒకటి. వాటిని చూస్తేనే చాలా మంది ఆమాడదూరం పరిగెడతారు. ఎక్కడ తమను కాటు వేస్తుందోనని తెగ భయపడిపోతారు. అలాంటిది ఓ వ్యక్తి అతిపెద్ద పామును.. చాలా తేలిగ్గా పట్టేసుకున్నాడు. అతి ప్రాణాంతకమైన సర్పాల్లో ఒకటిగా ఉన్న కోబ్రాను చిట్టెలుకలాగా బందించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏం జరిగిందంటే?
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి.. ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ఎంతో ధైర్యంగా ఎదుర్కొవడం కనిపించింది. ఓ గల్లీలోకి ప్రవేశించిన కోబ్రాను అతడు ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం వీడియోలో గమనించవచ్చు. అతడు ఓ పైపు చివర సంచిని తగలించి.. అందులో కోబ్రాను బంధించేందుకు యత్నించాడు. పైపులోనికి కోబ్రాను తీసుకొచ్చే క్రమంలో అది బుసలు కొడుతూ.. స్నేక్ క్యాచర్ పైకి వెళ్లడం ఆందోళనకు గురిచేసింది. ఎక్కడ కాటు వేస్తుందోన్న భయం వీక్షకులకు కలిగించింది. చివరికీ పాము.. పైపు ద్వారా సంచిలోకి చేరుకోవడంతో స్నేక్ క్యాచర్ దానిని జాగ్రత్తగా బంధించేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.
View this post on Instagram
నెటిజన్ల రియాక్షన్..
కోబ్రాను పట్టుకునే వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పామును పట్టుకోవడానికి కచ్చితత్వం, ధైర్యం రెండూ అవసరమే’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘ఈ పనిలో కేవలం ధైర్యమే కాక తెలివితేటలు కూడా కావాలి’ అని ఓ నెటిజన్ ప్రశంసించాడు. సాధారణంగా వానపాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది ప్రపంచంలోనే అతి విషపూరితమైన కోబ్రాను అతడు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ గుండె బతకాలి’ అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చారు. మెుత్తంగా ఈ థ్రిల్లింగ్ వీడియో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు.
కింగ్ కోబ్రాలు ఎందుకు ప్రత్యేకం?
కింగ్ కోబ్రాలు సామాన్య పాములు కావు. ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపాములు. ఒకసారి కాటు వేసిందంటే దాని విషం చాలా వేగంగా శరీరమంతా విస్తరిస్తుంది. ఫలితంగా నిమిషాల వ్యవధిలో మనిషి చనిపోతాడు. అందుకే ఎంతో శిక్షణ పొందిన వారు సైతం.. కోబ్రాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న దాని కాటుకు గురై క్షణాల్లో ప్రాణాలు పోతాయని వారికి తెలుసు. ఇదిలా ఉంటే ప్రపంచంలోని చాలా తెగలు కోబ్రాలను దైవంగా పూజిస్తుండటం విశేషం.
Also Read: Boat Trip: సోమశిల టు శ్రీశైలం.. కృష్ణానదిపై అద్భుత ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే?
పైప్ టెక్నిక్ గురించి..
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే కోబ్రాను పట్టుకునేందుకు పాముల సంరక్షకుడు ఓ పైపును ఉపయోగించాడు. ఇది పాముల సంరక్షకులు సాధారణంగా ఉపయోగించే ప్రత్యేకమైన పద్దతి. పామును కష్టపెట్టకుండా దాని దూకుడు పెరగకుండా పైప్ సహాయంతో నెమ్మదిగా సంచిలోకి దానిని తీసుకొస్తారు. ఈ పద్ధతిలో సాధారణంగా PVC లేదా మెటల్ పైప్ వాడతారు. ఆ పైప్ చివర ఒక వస్త్రం లేదా జాలి సంచి కట్టబడి ఉంటుంది. పాముకు ఆ పైప్ ఒక రక్షణ స్థలం అన్న భావన కలిగి అది స్వయంగా పైప్‌లోనికి వెళ్లిపోతుంది. అదే సమయంలో రక్షకుడు సురక్షిత దూరం పాటిస్తూ ఆ సంచిని మూసివేసేందుకు వీలు కలుగుతుంది.
