Boat Trip (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Boat Trip: సోమశిల టు శ్రీశైలం.. కృష్ణానదిపై అద్భుత ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే?

Boat Trip: తెలంగాణ టూరిజంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి శ్రీశైలానికి బోట్ జర్నీ ప్రారంభం కానుంది. నల్లమల అడవులు, కృష్ణా నది అందాలను పర్యాటకులు ప్రత్యక్షంగా ఆస్వాదించేందుకు ఈ బోటు జర్నీ ఎంతగానో ఉపయోగపడనుంది. శ్రీశైలంకు వెళ్లే బోట్లలో డబుల్ డెక్కర్ ఏసీలు లాంచీలు, మినీ లాంచీలు, స్పీడ్ బోట్లు ఉండనున్నాయి. డబుల్ డెక్కర్ ఏసీ లాంచీలో ఒకేసారి 120 మంది ప్రయాణించవచ్చు.

120 కిలోమీటర్లు, 7 గంటలు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి కృష్ణ నది కూడా శ్రీశైలం చేరుకునేందుకు 120 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. బోటులో ఈ మార్గంలో ప్రయాణించడానికి దాదాపు 7 గంటల సమయం పట్టనుంది. అంటే ఉదయం 9 గంటలకు సోమశిల నుంచి బయలుదేరితే సాయంత్రం 3:30 నుంచి 4 గంటల మధ్య శ్రీశైలం చేరుకుంటుంది. కాగా ఈ లాంచీలు సిద్దేశ్వరం, అమరగిరి ప్రాంతాల గుండా శ్రీశైలంకు ప్రయాణించనున్నాయి. ఈ మార్గంలో పర్యాటకులు.. నల్లమల అడవులు, కృష్ణా నది అందాలను చూడవచ్చు.

టికెట్ ధరలు, సౌఖర్యాలు
డబుల్ డెక్కర్ లాంచీలో ప్రయాణించే వారికి ఏసీతో పాటు భోజన వసతి సైతం అందించనున్నారు. ఇందులో ప్రయాణించాలంటే పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1,600లను టికెట్ ధరలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి సోమశిల, శ్రీశైలం కలిపి రెండు రోజుల టూర్ ప్యాకేజీ ధరలు పెద్దలకు రూ. 4,499 – రూ. 4,999 (సీజన్ లేదా ప్యాకేజీ రకాన్ని బట్టి మారవచ్చు)గా నిర్ణయించినట్లు సమాచారం. పిల్లలకు (5-11 ఏళ్లు) రూ. 3,599గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా సోమశిలలో నది ప్రయాణం చేయాలంటే 15 నిమిషాల వ్యవధికి ఒక్కొక్కరికి రూ.50 ఛార్జీ చేయనున్నారు. పిల్లలకు రూ.30 తీసుకోనున్నారు. ఫ్యామిలీతో వచ్చేవారు ఒక గంటకు బోట్ బుక్ చేసుకుంటే రూ.4000 చెల్లించాల్సి ఉంటుంది.

బుకింగ్ విధానం
సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లదలిచిన పర్యాటకులు టికెట్ల కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్ సైట్ https://tourism.telangana.gov.in/ సంప్రదించాల్సి ఉంటుంది. అందులోకి వెళ్లి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సందేహాలు ఉంటే 9848540371 (తెలంగాణ టూరిజం), 8287932229 / 8287932228 (IRCTC ప్యాకేజీల కోసం) సంప్రదించవచ్చు.

Also Read: Nandamuri Family: నందమూరి ఇంట తీవ్ర విషాదం.. జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూత

బోటింగ్ ఎందుకు ప్రారంభించారంటే?
తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో సోమశిల- శ్రీశైలం బోట్ జర్నీని ప్రారంభిస్తున్నట్లు ఇటీవల పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. అలాగే పర్యాటకులకు కృష్టానది, నల్లమల అడవుల అందాలను అందించడం దీని వెనకున్న మరో ముఖ్య ఉద్దేశ్యమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్ల బడ్జెట్ తో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. ఇందులో భాగంగానే సోమశిల- శ్రీశైలం బోట్ జర్నీకి అంకురార్పణ జరిగింది. ఈ బోట్ జర్నీ ద్వారా పర్యటక రంగానికి ఆదాయం పెరగడంతో పాటు పలువురికి ఉపాధి లభించనుంది.

Also Read This: IRCTC offers: రైల్వే స్పెషల్ ఆఫర్.. టికెట్లపై 20 శాతం డిస్కౌంట్.. ఎలా పొందాలంటే?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?