Siddepeta Tragedy: విద్యుదాఘాతంతో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా(Siddipet District)లో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం పెళ్లి జరిగిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నకోడూరు మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మూర్తి గజేందర్ రెడ్డి(50)చండ్లాపూర్ గ్రామాని(Chandlapur village)కి చెందిన పద్మతో వివాహం జరిగింది. అయితే ఇల్లరికం కావడంతో గజేందర్ రెడ్డి చంద్లాపూర్‌లోనే ఉంటున్నాడు. వీరికి కుమారుడు రాజిరెడ్డి(Raji Reddy)(27), కూతురు సంతోషిలు ఉన్నారు.
Also Read: SAIL Apprentice Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 816 పోస్టులు.. వెంటనే, అప్లై చేసుకోండి!
ఇద్దరు అక్కడికక్కడే మృతి
ఈ నెల 14న కూతురు సంతోషి పెళ్లి ఘనంగా జరిపించారు. పెళ్లి పనులు పూర్తి కావడంతో తండ్రి, కొడుకులు గంగాపూర్(Gangapur) శివారులోని పొలంలో మొక్కజొన్న పంటను అడవి పందుల బెడద నుంచి రక్షించేందుకు వైరు చుడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ రావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పొలానికి వెళ్లిన భర్త, కొడుకులు ఇంటికి రాకపోవడంతో భార్య పద్మ ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో సమీప రైతులకు ఫోన్ చేసి వారి సమాచారం కోరింది. అయితే వారు వెళ్లి చూడగా ఇద్దరు వైర్లు పట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ సైఫ్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read: Tummala Nageswara Rao: యూరియా సరఫరాలో కేంద్రం విఫలం.. మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు