Tummala Nageswara Rao (image CREDIT: SWETCHA REPRTER)
తెలంగాణ

Tummala Nageswara Rao: యూరియా సరఫరాలో కేంద్రం విఫలం.. మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు

Tummala Nageswara Rao: తెలంగాణకు యూరియా(Urea) సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తీవ్రంగా విమర్శించారు.  సచివాలయంలో రాష్ట్రంలో నెలకొన్న యూరియా(Urea) కొరతపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా, ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని, దీనివల్ల 2.69 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సరఫరా కావాల్సిన స్వదేశీ యూరియాలో, ప్రధానంగా ఏఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి రావాల్సిన యూరియాలో పెద్ద లోటు ఏర్పడింది. 145 పనిదినాలకు గాను 78 రోజులు ఉత్పత్తి జరగకపోవడమే దీనికి కారణం. దిగుమతి ద్వారా సరఫరా కావాల్సిన యూరియాను కొన్ని కంపెనీలు కొన్ని నెలల పాటు అసలు సరఫరా చేయలేదని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Urea shortage: అధిక ధరలకు యూరియా విక్రయాలు.. పట్టించుకోని వ్యవసాయ అధికారులు

బీజేపీపై మండిపడ్డ మంత్రి..
ఈ వాస్తవాలను తెలుసుకోకుండా బీజేపీ(BjP) నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడి రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) మండిపడ్డారు. కేంద్రం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సరఫరా చేయని యూరియా(Urea)ను సరఫరా చేసినట్లుగా చూపించడం సరికాదని అన్నారు. కేటాయించిన యూరియా మొత్తాన్ని తక్షణమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల చివరి నాటికి రాష్ట్రానికి నాలుగు నౌకల్లో యూరియా(Urea)వచ్చే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి, ప్రతి నౌక నుంచి అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా(Urea) కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. రైతులు(Farmers) అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయొద్దని, అలాగే యూరియా అమ్మకాలపై నిఘా పెంచాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంచాలకుడు గోపి, హాకా ఎండీ చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఎండీ రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 Also Read: Ravi Teja next movie: రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్.. క్లాస్ దర్శకుడితో మాస్ టచ్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు