Mahesh Kumar Goud: సీఎం రేవంత్.. రెడ్డి కాదని, బీసీ బిడ్డగానే పరిగణిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ఆయన పట్టుపట్టి బిల్లు, ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీ బిడ్డలకు న్యాయం చేసేందుకు ఆయన పట్టు సడలని ప్రయత్నం చేశారన్నారు. అందుకే ఆయన్ను బీసీ బిడ్డల సంక్షేమ నేతగా చూడాల్సి వస్తుందన్నారు. రిజర్వేషన్ల అమలు త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు.
Also Read: Mokshagna Teja: ట్రెడిషనల్ లుక్‌లో నటసింహం తనయుడు.. ఫొటో వైరల్! మళ్లీ ఆశలు మొదలు..
గోల్కొండ కిల్లాను కైవసం
ఇక కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళ కాంగ్రెస్ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. పదవులు రాలేదని ఎవరు నిరాశ చెందకూడదన్నారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక సాహసానికి ధైర్యానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన పాపన్న అప్పటి భువనగిరి ఖిల్లాతో పాటు ఔరంగాజేబు ఆధీనంలో ఉన్న గోల్కొండ కిల్లాను కైవసం చేసుకున్నారని గుర్తుచేశారు.
సచివాలయం దగ్గర పాపన్న విగ్రహం
పాపన్న ధైర్య సాహసాలను గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి రోమాలు నిక్కపొడుస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూరదృష్టి గల నాయకుడన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయం దగ్గర పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయమన్నారు. ఆరు నెలల్లో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారన్నారు. ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కుల సర్వే దేశానికి రోల్ మోడల్‌గా, దిక్సూచిగా మారిందన్నారు. కులవృత్తులు నశిస్తే మానవాళి మనుగడకు ప్రమాదమని, అందుకే కులవృత్తుల వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
Also Read:Tummala Nageswara Rao: రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు?