Nandamuri Mokshagna Teja: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) ఎంట్రీ కోసం, నందమూరి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. వాస్తవానికి మోక్షు ఎంట్రీ కోసం వారి నిరీక్షణ ఇప్పటిది కాదు.. దాదాపు 3, 4 సంవత్సరాల నుంచి ఇదిగో, అదిగో అంటూ వార్తలు రావడం.. బాలయ్య వాటిని ఖండించడం వంటివి జరుగుతూ వచ్చాయి. మధ్యలో మోక్షజ్ఞ భారీగా కనిపించడంతో.. ఆయనకు సినిమాల్లోకి రావడానికి ఇంట్రస్ట్ లేదేమో అనేలా కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు నడుస్తున్న సమయంలో సడెన్‌గా ఓ రోజు.. మోక్షు స్లిమ్‌గా తయారై, వచ్చేస్తున్నా.. అనేలా హింట్ ఇచ్చాడు. అలా ఆయన కనిపించిన కొన్ని రోజులకే.. ‘హను మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, రేపు సినిమా ప్రారంభోత్సవం అనగా, ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.
Also Read- Coolie Collections: ‘కూలీ’.. 4 రోజుల కలెక్షన్స్ పోస్టర్ వచ్చేసింది.. అరాచకం అంతే!
అందుకు కారణాలు రకరకాలుగా వినిపించినా, అటు ప్రశాంత్ వర్మ కానీ, ఇటు బాలయ్య వర్గం కానీ ఎవరూ వివరాలు తెలియజేయలేదు. దీంతో మరోసారి అభిమానులకు నిరాశ తప్పలేదు. ప్రశాంత్ వర్మతో సినిమా అంటూ విడుదల చేసిన రెండు స్టిల్స్ చూసిన నందమూరి అభిమానులకు ఆశలు చిగురించాయి. కానీ వెంటనే ఆవిరైపోయాయి. ఆ స్టిల్స్‌లో మోక్షుని చూసిన వారంతా ఇండస్ట్రీని దున్నేయడం పక్కా అనేలా ఫిక్స్ అయిపోయారు. కానీ, వెంటనే వారికి నీరసం వచ్చేసింది. ఆ తర్వాత మళ్లీ మోక్షు ఎంట్రీపై ఎటువంటి సమాచారం రాలేదు. బాలయ్య దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనేలా ఈ మధ్య మళ్లీ వార్తలు మొదలయ్యాయి. కానీ నందమూరి అభిమానులు మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఎగ్జయిట్ కాకూడనది ఫిక్సయ్యారు. అందుకే ఎక్కడా మోక్షు ఎంట్రీపై ఈ మధ్య కాలంలో హడావుడి చేయడం లేదు.
Also Read- VN Aditya: దాసరైనా, చిరంజీవైనా.. చర్చలతో సమస్యకి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే!
తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో మోక్షజ్ఞ కనిపించడంతో.. మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీపై హడావుడి మొదలైంది. ఈ ఫంక్షన్‌లో ప్రత్యేకంగా మోక్షజ్ఞనే వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోల్లో మోక్షు చాలా స్టైలిష్‌గా, సంప్రదాయబద్ధంగా కనిపించారు. గతంలో ఆయన కనిపించిన ఫోటోలతో పోలిస్తే, ఈ కొత్త లుక్‌లో కాస్త సన్నబడి, మరింత ఫిట్‌గా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ చూసిన వారంతా.. సింహం సిద్ధమవుతోందనడానికి ఇదే సూచన అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త లుక్, ఆయన ముఖంలో ఉన్న తేజస్సు నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఇదే కదా నందమూరి హీరో అంటే’ అంటూ అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. మరి మోక్షు అరంగేట్ర చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.
ఇంక నువ్వు సర్దుకోనే టైం వచ్చింది రా
“సింపతి స్టార్ జమ్మలమడుగు జమాలత్ భాషా” 🤣😂ఆహా ఏమి తెజస్సు , ఏమి అందం , ఏమి రాజసం…
ఆరడుగుల కటౌట్ 🔥🔥🔥🔥🔥🔥#NandamuriMokshagna 💥 pic.twitter.com/0TJDbiDrYJ— 🐎🔱సుజత్ ‘సున్నితమైన వాడు’ 🕉️☪️✝️ (@KadiroduOffl) August 17, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
