Tummala Nageswara Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Tummala Nageswara Rao: రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు?

Tummala Nageswara Rao: కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి యూరియాను కేంద్రం సరఫరా చేయలేక పోవడంతో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందని దీంతో రైతులకు సరిపడేలా ఒకేసారి అందించలేకపోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు9Min Tummala Nageshwar Rao) అన్నారు. ప్రస్తుతం లోటును దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లకు తగి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, హోల్ సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాముల్లో రోజువారి యూరియా స్టాక్ ను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ నుంచి వచ్చే రి మార్క్స్ వివరాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకొని మండలాల వారీగా అవసరానికి అనుగుణంగా కేటాయింపు చేయాలని కలెక్టర్లకు సూచించారు. యూరియా సరఫరాలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పెద్ద రైతుల అవసరాలకు విడతల వారీగా సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే పట్టాదారు పాసుపుస్తకాలు అనుసంధాన చేయాలని ఆదేశించారు.

అమ్మిన రిటైలర్ల వివరాలను

రైతులకు టోకెన్లు జారీ చేసి ఎలాంటి గందరగోళం లేకుండా యూరియా సరఫరా చేయాలని, యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్రాల మధ్య అక్రమ రవాణా అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూరియా వినియోగాన్ని సమీక్షించేందుకు ప్రతి నెల టాప్ 20 కొనుగోలుదారులు, తరచుగా కొనేవారు, అధికంగా అమ్మిన రిటైలర్ల వివరాలను (dbtfert.nic.in) వెబ్‌సైట్‌లో తనిఖీ చేయాలని, రైతులకు యూరియాను మితంగా ఉపయోగించాలని, నానో యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, బయో-ఫెర్టిలైజర్స్ వంటివి వినియోగించమని ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Also Read: GHMC – Hydraa: శిథిలావస్థ భవనాలు ఖాళీ చేయాలి.. లేదంటే కూల్చివేతలే!

కఠినంగా పర్యవేక్షణ

స్థానిక మీడియా ద్వారా ప్రకటనలు విడుదల చేసి, రైతులకు ప్రభుత్వం సమయానికి సరఫరా చేస్తున్నదని నమ్మకం కల్పించాలని అన్నారు. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని, మండలాల వారీగా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి, వ్యవసాయశాఖ, పోలీస్, సహకార సంస్థలతో సమన్వయం చేసి పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. యూరియా సరఫరా సాధారణ స్థితికి చేరేవరకు కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడే మాటలకు భయాందోళనలకు గురయ్యే యూరియాను అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని రైతులను కోరారు.

Also Read: Warangal District: హనుమకొండలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు.. అలరించిన నృత్యాలు

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!