Ganesh Immersion Process (imagecredit:twitter)
హైదరాబాద్

Ganesh Immersion Process: గణేష్ నిమజ్జనంపై బల్దియా ఫోకస్.. భారీగా ఏర్పాట్లు

Ganesh Immersion Process: గణేష్ నవరాత్రి ఉత్సవాలు త్వరలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉత్సవాలు, అందులో చివరి ఘట్టమైన గణేష్ నిమజ్జన కార్యక్రమంపై ఈ సారి కాస్త ముందు నుంచే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఓ దఫా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తో ఏర్పాట్లపై మూడు పోలీసు కమిష్నరేట్ పోలీసు అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. రూ.30 కోట్ల తో గణేష్ నిమజ్జనానికి బల్దియా ఏర్పాట్లు చేస్తుంది. సిటీలోని 30 సర్కిళ్ల పరిధిలోని 73 చెరువుల వద్ద జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. వినాయక విగ్రహాల ఎత్తును బట్టి 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు. ఈ మేరకు సర్కిల్ స్థాయిలో టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకునేందుకు గాను కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం సర్కిళ్ల వారీగా కన్వర్జెన్సీ సమావేశాలను కూడా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా సిటీలోని 30 సర్కిళ్లలో ఎక్కడికక్కడే గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగేందుకు వీలుగా మినీ పాండ్స్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ టెండర్ల ప్రక్రియను చేపట్టిం.

జీహెచ్ఎంసీ చేయాల్సిన ఏర్పాట్లు

ఈ సారి తాజాగా ఎస్క్యులేటర్ వాటర్ పాండ్స్ ను వినియోగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది. విగ్రహాలు నిమజ్జనం అవుతున్న కొద్దీ, ఆటోమెటిక్ గా విగ్రహ అవశేషాలు బయటకు పంపించే ఎస్క్యులేటర్ వాటర్ పాండ్ ను వినియోగిస్తే వినాయక నిమజ్జనం మరింత వేగంగా సాగుతుందని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి లోట్టుపాట్లు లేకుండా సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కానున్నగణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జీహెచ్ఎంసీ చేయాల్సిన ఏర్పాట్లు, ఉత్సవాల్లో చివరి ఘట్టమైన నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు వ్యూహానికి సంబంధించి మంగళవారం నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిసింది.

Also Read: Viral Video: పూరి ఆలయంలో అద్భుతం.. జెండా పట్టుకున్న హనుమాన్.. వీడియో వైరల్!

కాస్త ముందుగానే..

ముఖ్యంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఈ సారి 27వ తేదీకి కాస్త కొద్ది రోజుల ముందు నుంచే దూల్ పేట నుంచి మండపాలకు విగ్రహాలను తరలించే ప్రక్రియపై జీహెచ్ఎంసీ దృష్టి సారించనున్నట్లు తెలిసింది. వినాయక విగ్రహాలను తయారు చేసే దూల్ పేట, మంగళ్ హాట్ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల్లోని వినాయక మండపాలకు గణేష్ విగ్రహాలు తరలి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రూట్ మ్యాప్ ను అధికారులు సిద్దం చేస్తున్నారు. విగ్రహాల తరలింపులో ఎలాంటి లోపాలు జరగకుండా రోడ్లకు మరమ్మతులను చేయాలని సమీక్షలో ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ధ్వంసమైన రోడ్లకు రోడ్ సేఫ్టీ కింద జీహెచ్ఎంసీ మరమ్మతులు చేపట్టినా, అవి ఆశించిన స్థాయిలో ఫలితాలిన్వకపోవటంతో అవసరమైన చోట కొత్త రోడ్లు వేయటం, బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకున్న సుమారు 21 కిలోమీటర్ల నిమజ్జనం మెయిన్ రూట్ తో పాటు అందుకు లింకుగా ఉన్న సబ్ రోడ్లకు కూడా చేపట్టనున్న మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలకు సంబంధించి జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశంలో మంత్రికి నివేదికలను సమర్పించనున్నట్లు తెలిసింది.

Also Read: Collectorate: కలెక్టరేట్లో కామాంధుడు…? మద్యం సేవించి.. ఓ చిన్నారి పై?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?