Hydraa: హైదరాబాద్ మహానగరంలో చినుకు పడిందంటే చాలు చింతే. నిత్యం రద్దీగా ఉండే పలు కూడళ్లలో మొకాలి లోతు వరకు వర్షం నీలు నిలుస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు బేజారవుతున్నారు. ముఖ్యంగా దశాబ్దాల కాలంగా అమీర్‌పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా?అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సూచనల మేరకు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేకంగా ట్రంకు లైను ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక ఉపశమనానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై హైడ్రా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా9Hydraa) కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) అమీర్‌పేట మైత్రివనం పరిసరాల్లో వరద కాలువలకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు.
అనంతరం కృష్ణాకాంత్ పార్కులోని చెరువును, వరద కాలువలను తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 10, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల నుంచి కృష్ణాకాంత్ పార్కు మీదుగా పారే వరద కాలువలను పరిశీలించారు. కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువును కూడా తనిఖీ చేశారు. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న వరదను కృష్ణాకాంత్ పార్కులోని చెరువుకు మళ్లిస్తే చాలావరకు వరద ఉధృతిని కట్టడి చేయవచ్చుననే అభిప్రాయానికి హైడ్రా కమిషనర్ వచ్చినట్లు తెలిసింది.
Also Read: Fighter Shiva: ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’.. ‘ఫైటర్ శివ’ టీజర్ అరాచకం
చెరువుకు మళ్లించి
పై ప్రాంతాల నుంచి వచ్చే వరదను కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువుకు మళ్లించి కొంత మేర ఉధృతిని తగ్గించవచ్చా? అనే అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 7 ఎకరాల మేర పార్కులో ఉన్న చెరువును 12 ఎకరాల వరకూ విస్తరించడానికి వీలున్నట్లు కమిషనర్ గుర్తించారు. ఇలా 120 మిలియన్ లీటర్ల నీటిని కొన్ని గంటలు హోల్డ్ చేసి, వర్షం తగ్గిన తర్వాత కిందకు వదిలితే వరద ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చునన్న నిర్ణయానికొచ్చినట్ల్లు సమాచారం. ప్రస్తుతం కృష్ణాకాంత్ పార్కులోని చెరువులోకి నీరు వెళ్లకుండా, నేరుగా మధురానగర్ మీదుగా అమీర్‌పేట(Ameer Pet)కు వచ్చి చేరడంతో మెట్రో స్టేషన్ కింద భారీ మొత్తంలో వరద నీరు నిలుస్తున్నట్లు హైడ్రా కమిషనర్ తన పరిశీలలో గుర్తించారు. కృష్ణాకాంత్ పార్కులోని చెరువు నుంచి మధురానగర్ మీదుగా అమీర్‌పేట మెట్రో స్టేషన్ వరకూ 1100 మీటర్ల బాక్సు డ్రైన్ ఉంది. అమీర్‌పేట వద్ద భూమి సమాంతరంగా ఉండడంతో పై నుంచి భారీ మొత్తంలో వచ్చిన వరద కిందకు వెళ్లడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు హైడ్రా అధికారులు కమిషనర్‌కు వివరించారు. దీనికి తోడు పై నుంచి వచ్చిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వరద ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నట్లు కమిషనర్ తన పరిశీలనలో గుర్తించారు.
ఆటంకాలను గుర్తించాలి
అమీర్‌పేట – సంజీవరెడ్డి నగర్ ప్రధాన రహదారిని వరద నీరు దాటేందుకు వేసిన పైపు లైన్లలో ఉన్న ఆటంకాలను గుర్తించేందుకు జీపీఆర్ ఎస్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే) చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌అధికారులకు సూచించారు. దీని ద్వారా పైపులైన్లలో పేరుకుపోయిన పూడికను గుర్తించడం జరుగుతుందన్నారు. తొలగించడానికి వీలు కాని పక్షంలో బాక్సు డ్రైన్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటి వరకూ మెట్రో స్టేషన్ కింద ఉన్న పైపులైన్ లో నుంచి వరద నీరు సాఫీగా సాగేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని హైడ్రా కమిషనర్ సూచించారు. సారథి స్టూడియో పక్కనుంచి, మధురానగర్ మీదుగా వచ్చే వరద కాలువలు రోడ్డు దాటినప్పుడు తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తే ఇబ్బందులుండవని అధికారులు కమిషనర్ కు వివరించారు. ఇందుకు దీర్ఘకాలిక ప్రణాళిక, తాత్కాలిక ఉపశమనం కల్పించడంపై దృష్టి పెట్టాలని హైడ్రా అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Also Read: Kondal Rao: పేకాట ఆడుతూ దొరికిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తండ్రి