Minor Girl Assault Case: బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్ష , రూ.15 వేల జరిమానా విధిస్తూ ఒకటో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అపర్ణాదేవి సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బయ్యారం చిన్న తండా చెందిన బాధితురాలు బతుకుదెరువు కోసం కాజీపేట డీజిల్ కాలనీ ప్రాంతంలో మొక్కజొన్న కంకులు కాల్చి అమ్ముచుండేది. ఆమెకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలా పెళ్లి అయింది. జరిగినది. చిన్న కూతురు ఏడో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దనే ఉంటుంది. అప్పుడప్పుడు తల్లి వద్ద పనులు నిర్వహిస్తూ ఉండేది.
రోడ్డుపై వదిలేసి
ఈ క్రమంలో పర్వతగిరి మండలం అన్నారం తండాకు చెందిన నిందితుడు వాంకుడు చంద్రుడు (23) మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని 15 డిసెంబర్ 2022 రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఫోన్ చేసి ఆమెను బయటికి తీసుకెళ్లేవాడు తన కూతురు కోసం తల్లి వెతకగా నిందితుడు ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఈ విషయమై ఎవరికైనా చెబితే నీవు నాతో తీసుకున్న ఫోటోలు అందరికీ చూస్తానని ఆమెను భయపెట్టాడు. ఫోటోలు బయట పెడతానని బెదిరించి పలుమార్లు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఐ జి మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇట్టి కేసులో ప్రస్తుత ఇన్స్పెక్టర్ వై.సుధాకర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్. ఏరుకొండ సుధాకర్, కోర్టు లెసన్ ఆఫీసర్ ఏఎస్ఐ శ్రీమతి పరమేశ్వరి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. 15 మంది సాక్షులను విచారించిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసెసర్ బి.మల్లారెడ్డి వాదించారు. వాద ప్రతివాదాలు విన్న అనంతరం న్యాయమూర్తి పై తీర్పునిచ్చారు.
Also Read: Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’.. నిధి లుక్ చూశారా.. షాక్ ఇచ్చారుగా!
