Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’.. నిధి లుక్ చూశారా.. షాక్ ఇచ్చారుగా!
Nidhhi Agerwal in Raja Saab
ఎంటర్‌టైన్‌మెంట్

Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’.. నిధి లుక్ చూశారా.. షాక్ ఇచ్చారుగా!

Nidhhi Agerwal: నిధి అగర్వాల్.. ఈ పేరు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్ చిత్రాలలో ఏకకాలంలో హీరోయిన్‌గా ఛాన్స్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి సక్సెస్ రేట్ తక్కువే ఉన్నా, గ్లామర్ పరంగా మాత్రం మహారాణిలా వెలుగొందుతోంది. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా సక్సెస్ పరంగా నిరాశ పరిచినా, నిధి అగర్వాల్ పాత్రకు మాత్రం మంచి ఇంపార్టెన్సే లభించింది. అన్నిటికీ మించి.. సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ ఆమె పేరు పదే పదే ప్రస్తావించడం బాగా హైలైట్ అయింది. ఇంత కాన్వాస్ ఉన్న సినిమాను.. ఏకాకిలా ఒక్క నిధి అగర్వాల్ మాత్రమే తన భుజాలపై మోస్తూ.. ప్రమోట్ చేస్తున్న తీరు చూసి.. నాకే సిగ్గేసింది.. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ చేయాలని నేను కూడా వచ్చాను అంటూ.. పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఆ మాటలతో నిధి స్థానం, స్థాయి అమాంతం పెరిగాయి. సినిమా కనుక హిట్టై ఉంటే.. ఆమెకు వరుస అవకాశాలు వచ్చేవి. అయినా కూడా ఇప్పుడు బిజీ హీరోయిన్‌గానే ఉంది. ఇక విషయంలోకి వస్తే.. ఆదివారం (ఆగస్ట్ 17) ఆమె పుట్టినరోజును (HBD Nidhhi Agerwal) పురస్కరించుకుని ‘ది రాజా సాబ్’ నుంచి నిధి అగర్వాల్ స్పెషల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Clash Over Ganja: గంజాయి బ్యాచ్ హల్చల్.. యువకునికిపై ఎక్సైజ్ సిబ్బంది దాడి చేశారంటూ ఫిర్యాదు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఒక హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన ఈ చిత్ర టీజర్‌లో కూడా ఆమెకు స్థానాన్ని కల్పించారు. ఇక ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తెలుపుతూ, ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా నిధి అగర్వాల్ కనిపిస్తోంది. మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అస్కారమున్న పాత్రలో నటించిందనే విషయాన్ని ఈ పోస్టర్ తెలియజేస్తుంది. ఆమె పాత్ర ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే.. ఈ సినిమా హిట్ అవడం మాత్రం ఆమెకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చిన నేపథ్యంలో.. ఈ సినిమాతో కచ్చితంగా బ్రహ్మాండమైన సక్సెస్‌ని అందుకుంటానని నిధి ఆశ పడుతోంది.

Also Read- Rashmika – Vijay: ‘గీత గోవిందం’.. వైరల్ అవుతున్న విజయ్, రష్మికల లిప్ లాక్ వీడియో

ఈ సినిమాను తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తను మరింతగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటానని ఎంతగానో ఆశిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకుడు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్‌తో పాటు మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి