Modi-Putin
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Putin – Modi: మోదీకి పుతిన్ ఫోన్.. ట్రంప్‌తో భేటీలో ఏం జరిగిందో వెల్లడి

Putin – Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin – Modi) సోమవారం ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇటీవల అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను మోదీతో ఆయన పంచుకున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి వెల్లడించారు. ‘‘ఇటీవల అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన భేటీపై ఆలోచనలను నాకు ఫోన్ చేసి పంచుకున్న నా మిత్రుడు అధ్యక్షుడు పుతిన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తాం. రాబోయే రోజు మన మధ్య కొనసాగనున్న సంప్రదింపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Read Also- Kota Srinivasa Rao’s wife: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం.. ఆయన భార్య మృతి

ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 2022 నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై భారత అభిప్రాయాన్ని మోదీ మరోసారి స్పష్టంగా వివరించారని తెలిపింది. శాంతియుత పరిష్కారమే మార్గమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొంది. యుద్ధానికి ముగింపు దిశగా భారత్ సంపూర్ణ మద్దతును అందించేందుకు సిద్ధంగా ఉందంటూ మోదీ భరోసా ఇచ్చారని పీఎంవో వివరించింది.

Read Also- Putin – Modi: మోదీకి పుతిన్ ఫోన్.. ట్రంప్‌తో భేటీలో ఏం జరిగిందో వెల్లడి

భారత్-రష్యా ద్వైపాక్షిక సహకార అంశాలపై కూడా మోదీ, పుతిన్‌ మాట్లాడుకున్నారు. భవిష్యత్తులో సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. పుతిన్-ట్రంప్ భేటీకి పది రోజుల ముందు పుతిన్, మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా విధించిన సుంకాలపై చర్చించారు. ప్రపంచ వాణిజ్యంలో ఏర్పడిన అనిశ్చితి గురించి కూడా ఇరువురు మాట్లాడుకున్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పుతిన్ ఈ మధ్యే అలాస్కాలో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి శాశ్వత ముగింపు లక్ష్యంగా ఆ సమావేశం జరిగింది.

పుతిన్-ట్రంప్ భేటీని స్వాగతించిన భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ స్వాగతించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ (MEA) శనివారం ఒక ప్రకటన చేసింది. అలాస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశాన్ని స్వాగతిస్తున్నామని, ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం వేసిన ముందడుగుగా ఈ భేటీని ప్రశంసించింది. ‘‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ స్వాగతిస్తోంది. శాంతి సాధన కోసం ఇరువురు చూపిన నాయకత్వం ప్రశంసనీయమైనది’’ అని భారత్ వ్యాఖ్యానించింది. కాగా, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నారనే కారణాలను చూపుతూ భారత్ దిగుమతులపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చే విధంగా భారత్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..