Heavy Rains in Medchal: వర్షాలు.. ఆ గ్రామానికి రాకపోకలు బంద్!
Heavy Rains in Medchal( image Credt: swetcha reporte)
నార్త్ తెలంగాణ

Heavy Rains in Medchal: మేడ్చల్‌లో భారీ వర్షాలు.. ఆ గ్రామానికి రాకపోకలు బంద్!

Heavy Rains in Medchal: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మేడ్చల్(Medchal) మున్సిపల్ పరిధిలోని గౌడవల్లి(Gowdavalli) నుండి వచ్చే కాలువ పొంగిపొర్లుతోంది. ఈ కాలువ మేడ్చల్(Medchal) పెద్ద చెరువులో కలుస్తుంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మేడ్చల్(Medchal) నుండి గౌడవల్లికి వాహనాల రాకపోకలను పోలీసు(Police)లు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో, ప్రజలు కాలువ వద్దకు చేరుకుని నీటి ప్రవాహాన్ని చూస్తున్నారు. మత్స్యకారులు చేపలు పడుతున్నారు.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో

ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని లింగాపూర్(Lingapur) గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు లింగాపూర్(Lingapur) గ్రామ కాలువ పొంగిపొర్లడంతో, గ్రామానికి వెళ్లే రహదారిపై నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగాపూర్(Lingapur) వెళ్లాలంటే నూతనకల్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. డబిల్ పూర్ తో పాటు పలు గ్రామాలకు వెళ్లేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిం

షామీర్పేట్‌(Shamirpet)లో రాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలో లక్ష్మాపూర్ చెరువు ఆలుగు పారడంతో పాటు ఉద్ద మర్రి, అలియాబాద్ గ్రామ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడం రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీ వాహనాలను అనుమతిస్తున్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 Also Read: Jogulamba Gadwal district: గద్వాల జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..