PV Sindhu Loses To Carolin Marin Yet Again
స్పోర్ట్స్

Sports News: ఫైనల్‌లో సింధూకి మళ్లీ నిరాశే  

PV Sindhu Again Disappointed In The Final: మ‌లేషియా మాస్టర్స్ సూప‌ర్ 500 టోర్నీ ఫైన‌ల్లో టైటిల్‌ని సాధించడం కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న‌ భార‌త స్టార్ ష‌ట్ల‌ర్‌, తెలుగుతేజం పీవీ సింధుకు మ‌రోసారి నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో ఆడిన పీవీ సింధు ఓట‌మి చ‌విచూసింది.

ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ పోరులో చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16,5-21,16-21 తేడాతో సింధుకి ఊహించని షాక్‌ తగిలింది. ఈ ఫైనల్‌లో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైంది. మొదటి రౌండ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన సింధు, ఆ తర్వాత రెండు, మూడు రౌండ్ల‌లో ప్ర‌త్య‌ర్ధి నుంచి గ‌ట్టి పోటీని ఎదుర్కొంది. రెండో రౌండ్ ముగిసేస‌రికి ఇరువురు చెరో విజ‌యంతో సమంగా నిల‌వ‌గా ఫ‌లితాన్ని తెల్చే మూడో రౌండ్‌లో ప్ర‌త్య‌ర్ధి వాంగ్ జీయీ చెల‌రేగిపోయి సింధుకి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా టైటిల్‌ను ఎగ‌రేసుకుపోయింది.

Also Read:అరుదైన రికార్డు సాధించిన ప్లేయర్

దీంతో మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు గట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లైంది. తన ఓటమి పట్ల పలువురు సింధూకి అధైర్యపడవద్దని పలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా గెలుపోటములు సర్వసాధారణమని తరువాత ఆటలో తన ఆటని ప్రదర్శించాలని కోరుతున్నారు.

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..