A Rare Record Player: టీ20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా ఇంగ్లండ్‌తో ఆడుతున్న సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అరుదైన రికార్డు సాధించాడు. మరో ఆరు రోజుల్లో టీ20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ మహాసమరానికి సన్నద్ధమయ్యేలా ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు నాలుగు టీ20ల సిరీస్ ఆడుతోంది. మెగాటోర్నీకి ముందు ఇది మంచి ప్రాక్టీస్ అవుతుందని, జట్టు కూర్పును సిద్ధం చేసుకోవచ్చని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.
వరుణుడు తన ప్రతాపం చూపించడంతో కనీసం టాస్ కూడా పడలేదు.శనివారం జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ 23 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 183 రన్స్ చేసింది. ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తూ కెప్టెన్ బట్లర్ సత్తాచాటాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 160 రన్స్‌కే కుప్పకూలిపోయింది. టోప్లే మూడు వికెట్లు, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read:ఆ టైమ్‌లో ఎవ్వరు నన్ను అస్సలు..!
ఫకర్ జమాన్, బాబర్ అజామ్ టాప్ స్కోరర్లు. అయితే తన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించలేక పోయినప్పటికీ బాబర్ అరుదైన ఘనత సాధించాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక రన్స్ సాధించిన రెండో ఆటగాడిగా బాబర్ అజామ్ నిలిచాడు. అంతకుముందు ఈ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. 118 టీ20లు ఆడిన బాబర్ 41 సగటు, 129 స్ట్రైక్‌రేటుతో 3987 రన్స్ చేశాడు. హిట్‌మ్యాన్ 151 మ్యాచ్‌ల్లో 31 సగటు, 139 స్ట్రైక్‌రేటుతో 3974 రన్స్ సాధించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. 117 టీ20లు ఆడిన కోహ్లి 51 సగటు, 138 స్ట్రైక్ రేటుతో 4037 రన్స్ చేశాడు.