Jogulamba Gadwal (imagecredit:twitter)
క్రైమ్

Jogulamba Gadwal: మత్తులో యువత.. గద్వాల కేంద్రంగా గంజాయి‌ దందా?

Jogulamba Gadwal: జోగుళాంబ గద్వాల జిల్లాలో చాపకింద నీరులా గంజాయి దందా విస్తరిస్తోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా యువత, కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా దందా సాగుతోంది. జిల్లా కేంద్రంలో గంజాయి సరఫరా యథేచ్ఛగా కొనసాగుతుండగా, బానిసైన యువత భవిష్యత్‌ అంధకారమవుతోంది. జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి అడ్డాలు ఏర్పాటైనప్పటికీ నిఘా వ్యవస్థ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. పక్కా సమాచారంతో అధికారులు దాడులు జరుపుతున్నప్పటికీ వారి కళ్ళుగప్పి గంజాయి సరఫరాకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం గంజాయిని నామరూపాలు లేకుండా చేయాలని ఆదేశించినప్పటికీ జిల్లాలో జోరుగా విక్రయాలు సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

గంజాయి మత్తులో యువత

గంజాయి మత్తు జోగుళాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)కు సైతం పాకింది. పెద్ద పెద్ద పట్టణాలకు పరిమితమైన గంజాయి వాడకం, గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరిస్తోంది. యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే, వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ, ఇతరుల పై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లాలంటేనే ప్రజలు జడుసుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

యువతే లక్ష్యంగా

జిల్లా కేంద్రంలో కొన్ని కాలనీలతో పాటు పరిసర, గ్రామాల శివారులో యువత(Youth) గంజాయి బారిన పడినట్లు తెలుస్తోంది. యువత సిగరెట్ లోని తంబాకును దులిపేసి దాని స్థానంలో గంజాయిని నింపుకొని దమ్ము లాగిస్తూ హుక్కా తరహాలో పీల్చడం యువకులకు అలవాటు అయ్యింది. మత్తుకు అలవాటు పడిపోయిన యువకులు నేరాలకు అలవాటు పడిపోతున్నారు. గ్రామాలలో ఉన్న గుట్టలను, అడ్డాగా చేసుకొని గంజాయి వ్యాపారానికి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులే మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది

పక్కా రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా?

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం ఇప్పుడిప్పుడే అభివృధ్ది పథంలో పయణిస్తోంది. విద్యా, వైద్య, వ్యాపార రంగాలలో దూసుకెళ్తున్న జోగుళాంబ గద్వాల జిల్లాకు అటు ఎపి(AP) , ఇటు కర్ణాటక(Karnataka) రాష్ట్రాలు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గాన గంజాయి రవాణ అవుతోందా అనేది ప్రశ్నగా మారింది. ఏజెంట్లు ప్యాకెట్ల రూపంలోకి మార్చి వివిధ ప్రాంతాల్లోని యువత, విద్యార్థులకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు.

గద్వాల పట్టణంలో పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. గత కొన్ని నెలల క్రితం గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ని గద్వాల టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల గద్వాల రైల్వే స్టేషన్(Gadwal Railway Station) లో గంజాయి తీసుకునే యువకులు మత్తులో జరిగిన గొడవతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.‌ వారి‌ నుంచి పావు కేజీ గంజాయితో పాటు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గద్వాల టౌన్ కు చెందిన యువకులను, గోనుపాడు గ్రామానికి చెందిన యువకులను అదుపులోకి తీసుకుని టెస్ట్ చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తెలిసింది. గంజాయి ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వినికిడి.

Also Read: TGSPDCL: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం?

గోనుపాడు కేంద్రంగా??

జిల్లా కేంద్రం సమీపంలో గోనుపాడు కేంద్రంగా గంజాయి సరఫరా అవుతోందా? లేదా మరే ఇతర గ్రామాలను కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణ జరుగుతోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోనుపాడు గ్రామ యువత గంజాయికి బానిసైనట్లు స్వయంగా గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసుల తేలిక తీసుకోవడంతో యువత గంజాయి బారిన పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. మూడు రోజుల క్రితం గోనుపాడు కు చెందిన పదుల సంఖ్యలో యువకులను పోలీసులు అదుపులోకి టెస్టులు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. జిల్లా కేంద్రంలో కొందరు ఆకతాయిల ఆగడాలు ఎక్కువైనట్లు, గంజాయి మత్తులోనే ఆకతాయిలు రెచ్చిపోతున్నారని ఆరోపణలు‌ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చింతలపేట, పాత, కొత్త హౌసింగ్ బోర్డ్ లు, వేణు కాలనీలతో పాటు పలు కాలనీలలో గంజాయి బ్యాచ్ గుట్టుగా రహస్య ప్రదేశాలలో వీటిని క్రయ విక్రయాలు సాగిస్తున్నాట్లు పుకార్లు వినపడుతున్నాయి.

రాయచూరు నుంచి అక్రమంగా రవాణా??

గంజాయిని జిల్లాకు సమీపంలోని రాయచూర్ నుంచి అక్రమంగా జిల్లాకు సరఫరా చేస్తూ యువతకు చిన్నపాటి ప్యాకెట్లలో గంజాయిని నింపి రూ.500-1000 వరకు వాటిని గుట్టుగా అమ్ముతూ, ఎండు పొగాకును సిగరెట్లలో అమర్చి అక్రమార్జనకు పాల్పడుతూ యువతను పెడదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మత్తుకు బానిసైన యువత వారి భవిష్యత్తుపై దృష్టి సారించకపోవడంతో యువత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు.

మే నెలలో పట్టుబడిన గంజాయి విక్రేత

ఏడాది మే 14న జిల్లా కేంద్రంలోని కుంట వీధికి చెందిన బషీర్ కొంతకాలంగా జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో యువతకు గంజాయి అమ్ముతూ అనుమానాస్పదంగా తిరుగుతున్నడంతో బషీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 680 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని విచారించారు.హైదరాబాద్ లోని దూల్ పేట్ నుంచి గంజాయిని తీసుకువచ్చి గద్వాలలోని యువతకు అంటగడుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.

తల్లిదండ్రులదే బాధ్యత: గద్వాల డీఎస్పీ

పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి వ్యసనాల బారిన పడితే వాటి నుంచి తప్పించుకునేందుకు శ్రమించాల్సి వస్తుంది. ఒత్తిడి కారణంగానో, ఒంటరితనం భావనతో కొందరు, చెడు స్నేహాలతో మరికొందరు, ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్కసారి మద్యం, గంజాయి తాగితే, మనసుకు దాని పట్ల ఆకర్షణ పెరిగిపోయి. మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. మెదడును ఉత్తేజపరిచే మద్యం గంజాయి క్రమంగా దానికి బానిసను చేస్తుంది. తర్వాత మెదడు చురుకుదనం కోల్పోతుంది. మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.

Also Read: Sri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి 2025 స్పెషల్.. కృష్ణుడు ఎక్కడ ఉంటే, అక్కడే విజయం!

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం