CITU Bhaskar on BJP: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని హక్కుల సాధన కోసం కార్మికులు ఉద్యమలకు సిద్ధం కావాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని TNGO భవన్ లో సిఐటియు(CITU) ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్(Bhskar), గ్రామపంచాయతి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారలో ఉన్నా బీజేపీ(BJP) ప్రభుత్వం హిందుత్వ, కార్పొరేట్ మతోన్మాద విధానాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడి దారులకు కట్టబెట్టలని కుట్రలు చేస్తుందని అన్నారు. 79వ స్వతంత్రం దినోత్సవం సందర్బంగా ఎర్రకోట నుండి చేసిన మోడీ ప్రసంగం అబద్దలతో కుడిందని అన్నారు.
ప్రతినెల 6 వేల కోట్ల రూపాయలు
స్వతంత్ర పోరాటలో సంబందo లేని RSS గురించి మోడీ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. గత సంవత్సరం నుండి సబ్బులు, నూనెలు, బ్లాజ్ లు ఇవ్వడం లేదని మండి పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలలో పారిశుధ్య పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మున్సిపల్, గ్రామపంచాయతి కార్మికులను పట్టించుకున్న పాపాన లేదన్నారు. అదనపు పనులు చేయిస్తూ, అదనంగా కనీస వేతనం మాత్రం పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం 26 వేలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ(ESI), పిఎఫ్(PF), ఉద్యోగ భద్రత కల్పించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ 21,22 25 జీవోలను గెజిట్ చేయడం లేదని దుయ్య బుట్టారు. దీంతో కార్మికులు కనీస వేతనం ప్రతినెల 6 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్ పేర్లతో నియమకాలు చేపడుతూ కార్మికులను అన్యాయం చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. కాంటాక్ట్ కార్మికులకు నెలకు 12500 చెల్లిస్తే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు.
Also Read: Musi River Overflows: మూసీకి వరద ఉద్ధృతి.. తస్మాత్ జాగ్రత్త!
రాష్ట్ర మహాసభలు మెదక్ జిల్లాలో
పెరిగిన ధరలకనుగులంగా కార్మికులకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్, గ్రామపంచాయతి కార్మికులను మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను కూడా ప్రభుత్వం పర్మినెంట్ చేయడం లేదన్నారు. కాంటాక్ట్(Contract) , అవుట్ సోర్సింగ్(Out Sorcing), డేలివేజ్ పేరుతో నియామకాలు చేపట్టే పధ్ధతిని మానుకోవాలన్నారు. మెదక్ జిల్లాలో డిసెంబర్ 7 8 9 తేదీలలో రాష్ట్ర మహాసభలు మెదక్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు.
రాబోయే రోజుల్లో మెదక్(Medak) జిల్లాలో గ్రామపంచాయతి, మున్సిపల్ కార్మికుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు మెదక్ జిల్లా వేదిక కాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. అడివయ్య, సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, ఎ. మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, జిల్లా నాయకులు సంతోష్, కె. మల్లేశం, అజయ్, గ్రామపంచాయతి యూనియన్ జిల్లా కార్యదర్శి ఆసిఫ్, మున్సిపల్ కార్మికులు, గ్రామపంచాయతి కార్మికులు పాల్గొన్నారు.
Also Read: Mahavatar Narasimha: ఆ నిర్మాతకు కాసులు కురిపిస్తున్న కన్నడ ఫిలిం.. లాభం ఎంతంటే?