Modi Amith Shah
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Vice President: తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?. బలంగా వినిపిస్తున్న పేర్లు ఇవే

Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికకు (Vice President) ఇంకా నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉంది. దీంతో, అభ్యర్థి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్ఠానం వేగవంతం చేసింది. నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యేవారు ఆగస్టు 2027 వరకు పదవిలో కొనసాగాల్సి ఉంటుంది, కాబట్టి, అత్యంత జాగ్రతగా, విశ్వసనీయమైన వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపై కమలం పార్టీ అగ్రనేతలు కసరత్తులు చేస్తున్నారు.

వినిపిస్తున్న పేర్లు
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పరిశీలిస్తున్న జాబితాలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీహార్ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ర గెహ్లాట్, సిక్కిం గవర్నర్ ఓం మాథూర్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సిద్ధాంతవాది శేషాద్రి చారి పేరుపై కూడా చర్చ జరుగుతోందని బీజేపీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ను కూడా అభ్యర్థిగా నిలిపితే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. త్వరలోనే జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక దిశగా బీజేపీ అధిష్ఠానం లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కచ్చితంగా తమ పార్టీ నుంచే ఉంటారని కమలనాథులు చెబుతున్నారు. పార్టీకి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో బలమైన అనుబంధం ఉన్నవారికే అవకాశం ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగిస్తూ ఎన్డీయే నిర్ణయించడంతో కసరత్తులు చేస్తున్నారు.

Read Also- Trump Viral Video: పుతిన్‌తో భేటికి ట్రంప్ తాగొచ్చారా? నిజమే అంటోన్న నెటిజన్లు!

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌లు ఇప్పటికే పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కలిసినట్లుగా సమాచారం. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా జులై 21న రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఆరోగ్య కారణాలను చూపుతూ ఆయన రిజైన్ చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాల విషయంలో అసమ్మతి ఉందని, ధన్‌ఖడ్‌పై ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోవడమే అసలు కారణమంటూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి 2027 ఆగస్టు వరకు ధన్‌ఖడ్ కొనసాగాల్సి ఉంది. దాదాపు రెండేళ్లు ముందుగానే ఆయన వైదొలిగారు.

ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసిన నేపథ్యంలో, ఈసారి అభ్యర్థిని అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ధన్‌ఖడ్ వ్యవహారం మాదిరిగా పార్టీకి, ఉపరాష్ట్రపతికి మధ్య ఎలాంటి అనుమానాలు ఏర్పడే వాతావరణాన్ని పునరావృతం చేయకూదడని యోచిస్తోంది. నిజానికి ఉపరాష్ట్రపతికి తక్కువ అధికారాలే ఉంటాయి. కానీ, రాజ్యసభ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు.

Read also- Shreyas Iyer: ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపికలో ట్విస్ట్!.. స్టార్ బ్యాటర్ దూరం!!

ధన్‌ఖడ్ రాజీనామాకు కారణం ఇదేనా?
ధన్‌ఖడ్ రాజీనామాకు సంబంధించిన పలు కారణాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆయన ప్రభుత్వాన్ని పూర్తిగా అప్రమత్తం చేయకుండా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడమే ప్రధాన కారణమని వినిపిస్తోంది. ముఖ్యంగా, వివాదాస్పద జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయానికి వ్యతిరేకంగా ధన్‌ఖడ్ వ్యవహరించారని, దీంతో, పరిస్థితి తారాస్థాయికి చేరినట్టు జాతీయ రాజకీయ వర్గాలు విశ్లేసిస్తున్నాయి. అధికార బీజేపీ కూడా జస్టిస్ వర్మను అభిశంసించాలని భావించినప్పటికీ, ఇదే విషయమై విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ధన్‌ఖడ్ ఆమోదించడం వివాదానికి కేంద్ర బిందువు అని తెలుస్తోంది.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?