putin trump meeting
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Trump Putin meeting: ట్రంప్, పుతిన్ భేటీపై కేంద్రం కీలక ప్రకటన

Trump Putin meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలాస్కాలో శుక్రవారం అత్యంత కీలకమైన శిఖరాగ్ర సమావేశం (Trump Putin meeting) జరిగిన విషయం తెలిసిందే. అగ్రదేశాల అధినేతల మధ్య జరిగిన ఈ భేటీపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించిన కేంద్రప్రభుత్వం… శాంతి స్థాపన కోసం ఇరువురు నేతలు చూపిన నాయకత్వ చొరవ ‘చాలా ప్రశంసనీయం’ అని మెచ్చుకుంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర భేటీని భారత్ స్వాగతిస్తోంది. శాంతి సాధన కోసం ఇరువురు చూపిన నాయకత్వ చొరవ ఎంతో ప్రశంసనీయం. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని భారత్ అభినందిస్తోంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకెళ్లే మార్గం సాధ్యమవుతుంది. ఉక్రెయిన్‌ యుద్ధం వీలైనంత త్వరగా ముగిసిపోవాలని ప్రపంచమంతా కోరుకుంటోంది’’ అని ప్రకటనలో విదేశాంగ శాఖ పేర్కొంది. దీంతో, చర్చల ద్వారా ఉక్రెయిన్ యుద్ధ సమస్యను పరిష్కరించాలని భారత్ మరోసారి స్పష్టం చేసినట్టు అయింది.

Read Also- Shreyas Iyer: ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపికలో ట్విస్ట్!.. స్టార్ బ్యాటర్ దూరం!!

మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అనంతరం భారత్‌కు కాస్త ఊరట కలిగించే విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వాణిజ్య భాగస్వాములపై వెంటనే రెండో దఫా టారిఫ్ జరిమానాలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మరో రెండు మూడు వారాల్లో ఆ విషయం గురించి మళ్లీ ఆలోచించాల్సి రావచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులక్రితం రష్యాపై ఆగ్రహంతో మాట్లాడిన ట్రంప్, పుతిన్‌తో భేటీ తర్వాత సౌమ్యంగా మాట్లాడడం గమనార్హం. అలస్కా భేటీ చాలా బాగా జరిగిందని, ఈ సమావేశానికి 10కి 10 రేటింగ్ ఇస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపుపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు. 1945 తర్వాత యూరప్‌లో జరిగిన అతిపెద్ద యుద్ధంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిగణిస్తున్నారు. దీనిని ఆపేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే పుతిన్‌ను ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. అయినప్పటికీ ఎలాంటి అంగీకారం కుదరలేదు. ఇరువురూ దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. చాలా ఫలప్రదంగా జరిగాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ, యుద్ధం ముగింపుపై ఎలాంటి ఒప్పందం జరగలేదని ట్రంప్ క్లారిటీగా చెప్పారు.

Read Also- Murder in Saudi Arabia: సౌదీలో హత్య.. 26 ఏళ్లకు భారత్‌లో దొరికిన నిందితుడు

చాలా అంశాలపై తాము ఏకాభిప్రాయానికి వచ్చామని, కొన్ని కీలకమైన అంశాల్లో పూర్తి స్థాయిలో అంగీకారం సాధించలేకపోయామని ట్రంప్ వివరించారు. కొంత పురోగతి సాధించిన మాట నిజమేనని, అయితే, ఒప్పందం కుదరినట్టు అర్థం చేసుకోవద్దని అని క్లారిటీ ఇచ్చారు. ఇంకా చాలా కొన్ని అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, అందులో కొన్ని పెద్దగా ప్రాధాన్యం లేని విషయాలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క ముఖ్యమైన అంశం ఉందని, అయినప్పటికీ ఒప్పందం జరిగే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయని, తాము ఇంకా చేరుకోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు