Warangal Airport (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal Airport: ఎయిర్ పోర్టు భూ నిర్వాసితుల ధర్నా.. పరిహారం ఇవ్వాలని డిమాండ్?

Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ఏటు తేలకపోవడంతో ఎయిర్ పోర్ట్(Air Port) ఏర్పాటుకు ఆటంకాలు తొలగడంలేదు. సరిపడ పరిహారం చెల్లించాలని ఖిలా వరంగల్(Warangal) మండలంలోని మామునూరు ఎయిర్ పోర్టు(Mamuunuru Airport) భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. మామనునూరు ఎయిర్ పోర్ట్ కింద భూమి కోల్పోతున్న గాడిపల్లి గ్రామానికి చెందిన రోడ్ సైడ్ భూ నిర్వాసితులు మా భూమికి ఉన్న విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలి లేకుంటే తమ భూమికి బదులు భూమి కావాలంటూ డిమాండ్ చేశారు. నక్కల్లపెల్లి రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించాలని గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.

భూ నిర్వాసితులు ఆందోళనతో రహదారికి ఇరు వైపుల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సంధించిన పోలీసులు ఆందోళన వద్దకు చేరుకుని భూ నిర్వాసితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. భూ నిర్వాసితులు వినకపోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకువెళుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో భూ నిర్వాసితులు ఆందోళన విరమించారు.

పునఃపరిశీలన చేసి న్యాయం చేయాలి

మామునూరు ఎయిర్ పోర్ట్ కింద భూమి కోల్పోతున్న అందరూ రైతు(Farmers)లకు ఒకేలా పరిహారం చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదు. భూములకు ఒకే పరిహారం చెల్లించడం సరికాదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ ఒకేలా పరిహారం

ప్రభుత్వం అందరికీ ఒకేలా పరిహారం చెల్లించడం ఎలా న్యాయం అవుతుంది. రోడ్డు లేకుండా ఉన్న భూములకు కమర్షియల్ హంగులు ఉన్న భూములకు ఒకేలా పరిహారం ఇవ్వడం న్యాయం కాదు. రాహదరి పక్కనే కూడ లేఔట్ వెంచర్ పక్కనే నాలా కన్వర్షన్ అయిన అన్ని వసతులు ఉన్న భూములకు ఒకేలా ఎలా పరిహారం ఇస్తారు. ఇలా చేస్తే విలువైన భూములకు అన్యాయం జరిగినట్టే కదా…? ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి రోడ్ సైడ్ ఉన్న భూములకు పరిహారం ఎక్కువ చెల్లించాలి.

Also Read: Dornakal Irrigation Department: డోర్నకల్ ఇరిగేషన్ కార్యాలయంలో మద్యం పార్టీ చేసుకుంటున్న అధికారులు

ఉకంటి శ్రీనివాస్ రావు: భూమికి బదులు భూమి

మామునూరు ఎయిర్ పోర్ట్(mamuunuuru Air Port) కింద పోతున్న భూములే మాకు జీవన ఆదారం. వాటిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. భూములు ఇచ్చిన తరువాత మాకు వచ్చే పరిహారం డబ్బులతో మళ్ళీ భూములు కొనలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మా భూములకు బదులుగా మాకు సమాన విలువ గల భూమిని ఇవ్వాలని భూనిర్వాసితుడు కోరాడు.

కొంగర భాస్కర్: విలువ ప్రకారం పరిహారం

మామునూరు ఎయిర్పోర్టులో భూమిని కోల్పోతున్న మాకు ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో తీవ్ర నష్టం కలుగుతుంది. పంటలు వేసుకోవద్దని ఆదేశాలు ఉండడంతో అటూ పంటకు వేసుకోలేని పరిస్థితి ఇటూ పరిహారం రావడం లేదు. ప్రభుత్వం అన్ని అభూములను ఒక్కటే లెక్కన చూడడం సర్కారు రోడ్ పక్కన ఉన్న భూములకు దానికి అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలి. ఆ పరిహారం కూడ ఆలస్యం కాకుండా చూడాలని నిర్వాసితుడు కోరాడు.

కొత్తపల్లి చౌదరయ్య

రోడ్ లతో కనెక్టివి ఉన్న భూములు ఒక్కటి ఎలా అవుతాయి. గాడిపెల్లి గ్రామంలోని రోడ్ సైడ్ ఉన్న భూములు నెక్కొండ హైవే, ఖిలా వరంగల్ దూపకుంట కనెక్టివిటీ రోడ్, గాడిపెల్లి కనిపర్తి రాగశాయిపేట రోడ్లతో ఉన్న భూములకు వ్యవసాయ భూములకు పరిహారం ఒకేలా ఇవ్వడం సరికాదు. ఈ భూముల విలువలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల పేరుతో ఒకేలా పరిహారం ఇస్తే మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం భూముల విలువలను బట్టి రోడ్ సైడ్ ఉన్న భూములకు ఎక్కువ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Ramchander Rao: ఎన్నో స్కాములు చేసిన కాంగ్రెస్.. ఓట్ల చోరీ అంటే నమ్మేదెవరు?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?