Madhira Railway Station: నూతనంగా ఏర్పాటు చేయబడిన విశాఖపట్నం జోన్ కారణంగా ఇప్పటివరకు సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్‌లో ఉన్న మధిర రైల్వే స్టేషన్(Madhira Railway Station)ను విజయవాడ డివిజన్ (విశాఖపట్నం జోన్)లో కలుపుతున్నారని తెలుస్తుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మధిర రైల్వే స్టేషన్ (Madhira Railway Station)ను యథాతథంగా సికింద్రాబాద్ డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోట రాంబాబు, మోదుగు సైదులు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
మధిర ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధిర రైల్వే స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ డివిజన్‌లో కలిపితే తెలంగాణకు చెందిన రైల్వే ఆదాయం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి రైల్వేపరంగా పలు ఇబ్బందులు సృష్టిస్తుందని వివరించారు. ముఖ్యంగా ఉద్యోగులు, ప్రయాణికులు, మరియు మధిర ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని వారు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి,(Raghuram Reddy)ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Also Read:Fisheries Department: మేడ్చల్‌లో రూ.5.85 కోట్లతో భవనాల నిర్మాణం.. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు!