PM Vikasit Bharat Rozgar Yojana: ప్రైవేటు ఉద్యోగులకు సాయం
PM Modi
జాతీయం, లేటెస్ట్ న్యూస్

PM Vikasit Bharat Rozgar Yojana: ప్రైవేటు ఉద్యోగులకు రూ.15 వేలు సాయం.. అర్హతలు ఇవే

PM Vikasit Bharat Rozgar Yojana: దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం తన ప్రసంగంలో భాగంగా, ‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ అనే (PM Vikasit Bharat Rozgar Yojana) భారీ ఉపాధి ప్రోత్సాహక పథకాన్ని ఆయన ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా, తొలిసారి ఉద్యోగాల్లోకి అడుగుపెట్టే యువతను ప్రోత్సహించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. మొదటిసారి ప్రైవేట్ ఉద్యోగం పొందిన వారికి ఈ పథకం కింద నేరుగా ఆర్థిక సాయాన్ని అందిస్తారు. రూ. 15,000 మొత్తాన్ని ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా అందిస్తారు.

ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత తొలిసారి , ఉద్యోగం మానేయకుండా ఉంటే 12 నెలల తర్వాత రెండో దఫా నగదును సాయంగా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని ఈపీఎఫ్‌వో (Employees’ Provident Fund Organisation) ద్వారా అందిస్తారు. వ్యవస్థీకృత రంగంలో యువతను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ తరహా ప్రోత్సాహకాల ద్వారా వ్యవస్థీకృతరంగంలో యువత భాగస్వామ్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also- Humayun Tomb complex: హుమాయూన్ సమాధి కాంప్లెక్స్‌లో తీవ్ర విషాదం

యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహకాలు

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద కొత్త ఉద్యోగాలు సృష్టించి, యువతను ప్రోత్సహించేందుకుగానూ ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహాకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతి కొత్త ఉద్యోగిపై నెలకు రూ. 3,000 వరకు ప్రోత్సాహకాన్ని కంపెనీల యాజమాన్యాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రెండేళ్లపాటు పొందే వీలుంటుంది. అయితే, తయారీ రంగంలో (Manufacturing Sector) అయితే ఈ ప్రోత్సాహకాల్ని మూడో, నాల్గో సంవత్సరాల వరకూ కేంద్రం పొడగించనుంది. ఈ ప్రోత్సాహకం పొందేందుకు కంపెనీలు అర్హత సాధించాలంటే, కొత్తగా నియమించుకున్న ఉద్యోగులను కనీసం 6 నెలల పాటు ఉద్యోగం కొనసాగించాలి. అలాగే మరికొన్ని నియామక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Read Also- Bhuvneshwar Kumar: బుమ్రా ‘వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌’పై భువీ ఆసక్తికర వ్యాఖ్యలు

అర్హతల వివరాలు ఇవే..

ఈ పథకం కింద మొత్తం రూ.1 లక్ష కోట్లు కేంద్రం పెట్టుబడి పెట్టనుంది. 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరే సుమారు 1.92 కోట్ల మందికి లబ్ధి చేకూరవచ్చని అంచనాగా ఉంది. అర్హతల విషయానికి వస్తే, నెల శాలరీ రూ.1,00,000 లోపే ఉండాలి. మొదటి ఉద్యోగం పొందిన వారికి మాత్రమే రూ.15,000 ప్రోత్సాహకం అందుతుంది. తొలి పేమెంట్ ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత, రెండవ విడత పేమెంట్ 12 నెలల తర్వాత చెల్లిస్తారు. సేవింగ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. ఆర్థిక జ్ఞానం, సేవింగ్స్ అలవాటును పెంపొందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని శ్రామిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈపీఎఫ్‌వో ద్వారా పంపిణీ చేస్తారు.

Read also- Dogs in Countries: కుక్కలు ఎక్కువగా ఉన్న టాప్-10 దేశాలు ఇవే

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!