Independence day celebrations: జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి & ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఎ.పి. జితేందర్ రెడ్డి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు.
ఉచిత రేషన్ సన్న బియ్యం
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు వివరాలను తన సందేశం ద్వారా తెలియజేస్తూ,భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, స్వతంత్ర తరువాత పేదరికం, అసమానతలు,అస్పృశ్యతపై పోరాటం ప్రారంభించి ప్రజాస్వామ్య పునాదులు వేసినట్లు తెలిపారు. 70 ఏళ్లుగా ప్రజల ఆహార భద్రత కోసం పి.డి.ఎస్ వ్యవస్థ భరోసా ఇస్తోందని,ఉగాది నుండి “సన్న బియ్యం” పంపిణీ ప్రారంభించబడిందని తెలిపారు. జూన్, జూలై, ఆగస్ట్ లో 1,64,357 రేషన్ కార్డు(Ration card)దారులకు 11,163 మెట్రిక్ టన్నుల ఉచిత రేషన్ సన్న బియ్యాన్ని పంపిణీ చేసినట్లు తెలిపారు.జూలై 14 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి, పదేళ్ల తర్వాత రేషన్ షాపుల వద్ద సందడి మొదలైందని తెలిపారు. రైతు సంక్షేమంలో 58,113 మంది రైతులకు 513 కోట్ల 99 లక్షల రూపాయల పంట రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు.
ఇందిరమ్మ రైతు భరోసా పథకం(Indiramma Farmer Assurance Scheme) కింద ఎకరాకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం అందించారని, జూన్ 16న ప్రారంభించి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.జిల్లాలో 2025-26 వ వానాకాలంలో 1,69,299 మంది రైతులకు 268 కోట్ల 84 లక్షల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు, కొత్త దరఖాస్తు చేసిన 3,289 రైతులకి కూడా పెట్టుబడి సాయం అందించారని పేర్కొన్నారు. జిల్లాలో 75 కొనుగోలు కేంద్రాల్లో 95,378 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి,క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇస్తూ 221.27 కోట్లు రైతుల(Farmers) ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.జిల్లాలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పంపిణీ లో భాగంగా 59,505 పంపు సెట్లకు విద్యుత్ అందించడం,దీనికి 42.80 కోట్లు సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు.
సంక్షేమానికి 1,13,000 కోట్లు
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ సంక్షేమానికి 1,13,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం,మొత్తం 22,500 కోట్లు ఖర్చు, ఒక్క ఏడాదిలో 4,50,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయబోతున్నట్లు,ఇప్పటివరకు 6,815 గృహాలు మంజూరు, 816 గృహాల నిర్మాణ దశల బట్టి లబ్ధిదారులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలలో, విద్యా , ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి, గ్రూప్-1లో 15, గ్రూప్-2లో 18, గ్రూప్-3లో 26 కులాలను చేర్చినట్లు తెలిపారు.
ఆరోగ్య శ్రీ పరిధిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి, జిల్లాలో 10,723 మందికి వైద్య సేవలు అందించడానికి 27.63 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్లు ఖర్చు చేసి నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయం నిర్మించడం,34 ఎకరాల విస్తీర్ణంలో 101.20 కోట్లు వ్యయంతో మెడికల్ కాలేజీ,నర్సింగ్,అకడమిక్ బ్లాక్, సెంట్రల్ మెడిసిన్ స్టోర్,క్రిటికల్ కేర్ యూనిట్ల నిర్మాణం,వాటిలో మెడికల్ కాలేజీ,సెంట్రల్ మెడిసిన్ స్టోర్ పూర్తయి ఉపయోగంలో, మిగతా పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.
77.26 కోట్లు ఆదా,200 కోట్ల జీరో టికెట్ల
మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యం,జిల్లాలో 77.26 కోట్లు ఆదా,200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటినట్లు, రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమానికి మొత్తం 46,689 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.యువతకు టిజిపీఎస్సీ ద్వారా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వివరించారు.తెలంగాణలో సాగునీరు,పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కృష్ణా-గోదావరి వాటాల సాధనలో విజయాన్ని సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047” ప్రణాళికలో 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని గౌరవప్రదంగా ప్రపంచ వేదికపై నిలబెట్టే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దేశభక్తి ఉట్టిపడేలా బాల భవన్, వివిధ పాఠశాలల విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేసి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఐడీఓసీలో పథకావిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్
అంతకు ముందు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో కలసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,స్వాత్రంత్ర సమర యోధులకు ఘనంగా నివాళు అర్పించారు. ఈ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో అలివేలు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు