Medchal ( IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

Medchal: మేడ్చల్ శ్రీరంగవరం బస్సు లేక జనం తిప్పలు

Medchal: మేడ్చల్ శ్రీరంగవరం దారిలో ఆర్టీసీ బస్సు (bus) ప్రారంభమయ్యేదెప్పుడూ అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంతో జరిగిన జాప్యంతో ఆ దారిలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ(rtc)  బస్సు నిలిపివేశారు. కాగా, ఇప్పుడు వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో ప్రారంభించారు. వంతెన నిర్మాణం కారణంగా దాదాపు ఐదేళ్లుగా ఆర్టీసీ(RTC)  బస్సు(bus)ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిర్మాపూర్, రాయిలాపూర్, శ్రీరంగవరం, బండమాదారం, నాగులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గిర్మాపూర్లో పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఈ కళాశాలలో వందలాది మంది విద్యార్థులు(Students) చదువుతున్నారు.

Also Read: Jogulamba Temple: జోగులాంబ ఆలయ ఈవో బదిలీ.. ముగ్గురు అర్చకులపై సస్పెన్షన్‌ వేటు

కాగా, మేడ్చల్(Medchal) -శ్రీరంగవరం దారిలో ఉన్న గ్రామాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు మేడ్చల్లో(Medchal)ని వివిధ పాఠశాలలు, కళాశాలలు, నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్నారు. వారంతా మేడ్చల్‌కు రావడానికి ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పాఠశాల బస్సులో రావాల్సి వస్తుంది. ఇందుకోసం ప్రతినెలా రూ.1200 నుంచి రూ.2వేల వరకు వెచ్చిచ్చాల్సి వస్తుంది. ఇందుకు పేద, మధ్య తరగతి కుటుంబాల్లోకి విద్యార్థులకు భారంగా మారింది. ఆర్టీసీ బస్సును నడిపితే విద్యార్థిను(Student)లకు ఉచిత బస్సు(bus) ప్రయాణం, విద్యార్థులైతే రాయితీని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఎంతో సొమ్మును ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్సు ఎపుడు వేస్తారు సారూ
మేడ్చల్(Medchal)- శ్రీరంగవరం బస్సు(bus)ను ఎప్పడేస్తారూ సారూ అంటూ గిర్మాపూర్, రాయిలాపూర్, బండమాదారం తదితర గ్రామాల ప్రజలు ఆర్టీసీ(RTC)  అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా ఎంతో మంది నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆర్టీసీ(RTC)  అధికారులకు బస్సును పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. వెంటనే బస్సు(bus)ను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

గిర్మాపూర్ మీదుగా బస్సు నడపాలి
గిర్మాపూర్ మీదుగా బస్సు నడపాలి. మా ఊరి మీదుగా బస్సు నడవక ఐదేళ్లు అయింది. అప్పటి నుంచి ఆటోల మీదనే తిరుగుతున్నాయి. మా పిల్లలను మేడ్చల్లో ఉన్న పాఠశాలకు ఆటోల మీద పంపడానికి ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. రైల్వే వంతెన ప్రారంభించినందున వెంటనే బస్సును నడపాలి.
 లావణ్య, గిర్మాపూర్

పట్టించుకోవడం లేదు
ఆర్టీసీ(RTC) బస్సును నడపాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదు. బ్రిడ్జి నిర్మాణంతో ఐదేళ్ల నుంచి బస్సును నడపలేదు. కానీ, ఇప్పుడు వంతెన ప్రారంభమైనా బస్సును నడపడం లేదు. దాదాపు ఏడాదిగా బ్రిడ్జి కింది నుంచి రాకపోకలు సాగుతున్నా బస్సు ఎందుకు నడపడం లేదో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలి.
సంతోషిని, గిర్మాపూర్

 Also Read: UPI Down: దేశంలో నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే చెల్లింపులు.. ఎందుకంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!