Supreme Court: వీధి కుక్కలతో ఢిల్లీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ మధ్య సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్క(Dog)లను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో జస్టిస్ విక్రమ్ నాథ్,(Justice Vikram Nath) జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. శునకాల బెడదకు అధికారులే కారణమని, చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. జంతు సంతతి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితికి దారి తీసిందని వ్యాఖ్యానించింది.
Also Read: Musi River Overflows: మూసీకి వరద ఉద్ధృతి.. తస్మాత్ జాగ్రత్త!
అధికారుల తీరుపై సుప్రీంకోర్టు
విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, కుక్క(కుక్క(కుక్క(Dog)లను తరలించాలన్న నిర్ణయాన్ని సమర్థించారు. దీన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య తక్కువేనని, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. మాంసం తినే వాళ్లు జంతు ప్రేమికులమని ప్రకటించుకోవడం ఏంటని ప్రశ్నించారు. అటువైపు, కపిల్ సిబల్ వాదిస్తూ, కుక్కలు తరలించాలని ఆదేశాలిచ్చారు సరే షెల్టర్లు ఎక్కడ ఉన్నాయని అడిగారు. మున్సిపల్ కార్పొరేషన్ నిర్మిస్తుందా అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది.
Also Read: Manda Krishna Madiga: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శలు
