Class 11 Student (Image Source: Twitter)
Viral

Watch Video: క్లాస్ రూమ్‌లో విషాదం.. ఫ్రెండ్స్ కళ్లెదుటే మరణించిన విద్యార్థి.. వీడియో వైరల్!

Watch Video: తమిళనాడు విల్లుపురం జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్లాస్ లో అందరూ చూస్తుండగానే ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. విద్యార్థి మృతితో కళాశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు విల్లుపురం జిల్లా మెల్‌తేరు ప్రాంతానికి చెందిన మోహన్‌రాజ్.. బుధవారం ఎప్పటిలాగే కళాశాలకు వచ్చి తరగతి గదిలో తన స్థానంలో కూర్చున్నాడు. కొద్ది సేపటికి ఎటువంటి సూచన లేకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మోహన్ రాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పోస్టుమార్టానికి తరలింపు
విద్యార్థి మృతి వార్త తెలియగానే పోలీసులు.. సదరు కళాశాలకు చేరుకున్నారు. దర్యాప్తులో భాగంగా క్లాస్ రూమ్ లోని సీసీటీవీని పరిశీలించారు. అందులో బాలుడు కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోస్ట్ మార్టం నిమిత్తం మోహన్ రాజ్ మృతదేహాన్ని ముండియంపాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా విద్యార్థి మరణానికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

క్షణాల్లో వైరల్
క్లాస్ రూమ్ లో విద్యార్థి కుప్పకూలిన వీడియో బయటకు రావడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కారణాలపై స్పష్టత ఇవ్వాలని పోలీసులను కోరుతున్నారు. విద్యార్థి మృతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో కళాశాల అప్రమత్తమైంది. యాజమాన్యం తక్షణమే సెలవు ప్రకటించింది.

Also Read: Ponguleti srinivas reddy: భారీ వర్షాల ఎఫెక్ట్.. కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి అత్యవసర భేటి.. కీలక ఆదేశాలు జారీ!

భారీగా పోలీసులు మోహరింపు
మరోవైపు విద్యార్థి మృతి నేపథ్యంలో కళాశాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల పరిసరాల్లో 50 మందికి పైగా పోలీసులను మోహరించారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి అనుమానాస్పద అంశాలు కనుగొనలేదని కానీ పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చే వరకు తుది నిర్ణయం తీసుకోబోమని పోలీసులు స్పష్టం చేశారు. ‘మృతి చెందిన విద్యార్థికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

Also Read: Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

బాధిత కుటుంబం సంచలన ఆరోపణలు..
అయితే తమ బిడ్డ మృతికి కళాశాలదే బాధ్యత అని మోహన్ రాజ్ కుటుంబం ఆరోపిస్తోంది. చదువు పరంగా అతడిపై కళాశాల ఎంతో ఒత్తిడి తీసుకొచ్చిందని పేర్కొంది. మానసికంగా ఒత్తిడి పెరిగిపోవడం వల్లే తమ బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. మెుత్తంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేగానీ విద్యార్థి మృతిపై స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.

Also Read This: Stray Dogs: మీ వీధిలో కుక్కలు ఉన్నాయా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే మీ పని ఔట్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!