Khammam Police commissioner: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Sunil Dutt) సూచించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని కాల్వఒడ్డు మున్నేరు, ప్రకాశ్ నగర్ మున్నేరు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. రాబోయే మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు.
Also Read: Telangana Rural Irrigation Corporation: గత ప్రభుత్వంలో కార్పొరేషన్ నిధులు పక్కదారి
సహాయం కోసం డయల్ 100, 1077
ప్రజలు జలమయమైన రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని, వాహనదారులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని సూచించారు. ముఖ్యంగా సెల్ఫీల కోసం యువకులు నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో సహాయం కోసం డయల్ 100, 1077 (కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్), పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 87126 59111, కలెక్టర్ ఆఫీస్ సెల్ నెంబర్ 90632 11298కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్ మోహన్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Hydraa: రౌండ్ ది క్లాక్ విధుల్లో 3565 మంది.. ఎప్పటికప్పుడు హైడ్రా చర్యలు