Mahabubabad district: వర్షాకాలం వచ్చిందంటే ఆ రహదారిపై ఉన్న కష్టాలు మరెక్కడ కనిపించవు. మున్నేరు(Munneru) పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా, ఎగువ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడిన ఈ రహదారిపై రాకపోకలు బందు కావాల్సిందే. జిల్లాస్థాయి అధికారులంతా అక్కడ ఉండి పర్యవేక్షించాల్సిందే. ఇది మహబూబాబాద్(Mehabubabad) జిల్లాలోని గార్ల మండలం రాంపురం.. మద్దివంచ పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా ఈ దుర్గతి ఇక్కడి ప్రజలకు పడుతుంది. గత బిఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో ఎన్నోసార్లు రహదారిపై ప్రజలకు కలిగే ఇబ్బందులు తొలగించాలని ఇటు గ్రామస్తుల నుండి అటు ప్రజాప్రతినిధుల నుండి విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. అగో అన్నారు.. ఇగో అన్నారు.. కానీ అభివృద్ధి పనులు మాత్రం కాలేదు.
పాకాల ఏటి కష్టాలు ఇంకెన్నాళ్లు..?
మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలోని రాంపురం. మద్దివంచ గ్రామాల ప్రజలు పాకాల ఏటి కష్టాలు ఇంకెన్నాళ్లని ప్రశ్నిస్తున్నారు. గార్ల మండలంలోని రాంపురం, మద్దివంచ, కొత్త తండా, పులి గుట్ట తండా, రాము తండా పరిసర గ్రామాల ప్రజలు ప్రతి ఏడాది వర్షాకాలంలో గార్ల సమీపంలోని పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా ప్రతి వర్షాకాలం పాకాల ఏరు ప్రమాదకరంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. పాకాల ఏటిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని ప్రజలు దశాబ్ద కాలం నుంచి కోరుతున్నప్పటికీ గత పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో మాత్రం హై లెవెల్ వంతెన కడతామని ప్రభుత్వాలు హామీలు గుప్పిస్తూ వంచిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమకు మరణమే శరణ్యమా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకాల వీరు ఉప్పొంగి ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు చావు అంచుల దాకా వెళ్లి బతికి బట్ట కట్టిన సందర్భాలు కోకొల్లలు. మరి కొంతమంది మరణించారు.
Also Read: Spa Centers in Hyderabad: స్పా సెంటర్ల ముసుగులో మహానగరంలో గలీజ్ దందాలు..
వర్షాకాలంలో రైల్వే బ్రిడ్జి శరణ్యం
ప్రతి ఏడాది వర్షాకాలంలో పాకాల వరద ఉధృతి నెలపాటు రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాంపురం, పులిగుట్ట తండా, కొత్త తండా, మద్దివంచ గ్రామాలతో పాటు మరికొన్ని తండాలు గ్రామాలకు సుమారు 3000 మంది ఈ రహదారిపై ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పాకాల ఏరు ప్రవహిస్తున్న సమయంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా రైల్వే బ్రిడ్జి(Railway Bridge) శరణ్యంగా మారుతుంది. రైతులు ఎరువులు, పురుగు మందులు తెచ్చుకోవాలన్న సుదూర ప్రాంతాల కు పెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి వస్తుందని ఆ పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెక్ డాం దాటుతూ ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు పాకాల ఏటిలో కొట్టుకుపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. రైతులు నిత్యవసర పనులకు, ఆస్పత్రులకు, విద్యార్థులు గార్ల లోని ప్రైవేట్ పాఠశాలలకు రావాలంటే రహదారి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో రైల్వే బ్రిడ్జిపై నుంచి మూడు కిలోమీటర్లు బిక్కుబిక్కుమని నడుచుకుంటూ వెళ్లి వస్తుంటారు.
హై లెవెల్ వంతెన కష్టాలు తీర్చాలి
గత తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం ఎన్నో మార్లు గార్ల రహదారిపై హై లెవెల్ వంతెన(High Level Bridge) కడతామని హామీ ఇచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఫామ్ హౌస్ సీఎం(CM) పట్టించుకోలేక ఇక్కడికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ, మరణ శాసనాలకు తల వంచాల్సిన దుస్థితి దాపురిస్తుందని గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కనీసం కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలోనైనా రాంపురం.. గార్ల మధ్య పాకాల ఏటిపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రహదారిపై రాకపోకలకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: War 2 vs Coolie: టికెట్ అమ్మకాల్లో ప్రభంజనం.. ఆదిపత్యం ఎవరిదంటే..