Khammam District (imagecredit:swetcha
నార్త్ తెలంగాణ

Khammam District: ఆర్&ఆర్ ప్యాకేజీలో అవకతవకలు.. ఏడేళ్లుగా పోరాటం.. పట్టించుకోని అధికారులు

Khammam District: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి గ్రామం జేవిఆర్ఓసి-2 ప్రాజెక్ట్ కోసం జరిగిన భూసేకరణలో భూములు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి దళారీగా వ్యవహరించి రెవెన్యూ(Revenue) అధికారులను తప్పుదారి పట్టించి అర్హుల జాబితాలో మార్పులు చేసి కొందరికి అన్యాయం జరిగేలా చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 258 మంది అర్హులు, జాబితా 229 మందికి కుదింపు చేశారు. 2016లో అప్పటి మండల తహసీల్దార్(MRO) నిర్వహించిన సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం, భూసేకరణ చట్టం 2013, సెక్షన్ 3(c) & 3(m) ప్రకారం 258 మందిని అర్హులుగా గుర్తించారు. ప్రతీ ఒక్కరికీ రూ.12.69 లక్షల చొప్పున రూ. 33.94 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు జాయింట్ కలెక్టర్, ఆర్ & ఆర్ అడ్మినిస్ట్రేటర్ సిఫారసు చేశారు.

కానీ కల్లూరు ఆర్డీవో కార్యాలయం ఏర్పడే సమయాన్ని అదునుగా తీసుకొని, ఒక ఉద్యోగి తన ప్రేరేపణతో జిల్లా కలెక్టర్ ఆదేశాలు లేకుండా, ఆర్&ఆర్ ఆఫీసరుకి తెలియకుండా, మండల రెవెన్యూ సిబ్బందికి డబ్బు ఆశ చూపించి, కొంతమందిని (ముఖ్యంగా వివాహితలను) జాబితా నుండి తొలగించి, అర్హుల సంఖ్యను 229 మందికి కుదించినట్లు తెలుస్తోంది. దీని వల్ల రూ. 33.94 కోట్లకు బదులుగా ఒక్కొక్కరికి రూ.7.61 చొప్పున నష్టపరిహారం చెల్లించేలా కేవలం రూ. 17.44 కోట్లు చెల్లింపులు జరిగాయని, ఇదే సమయంలో గ్రామంలోని ఆర్ & ఆర్ ప్యాకేజీ తీసుకున్న మహిళల వద్ద ఈ దళారి స్వయంగా డబ్బులు అడిగినట్టి ఆధారాలు ఆ గ్రామ యువకుల దగ్గర ఉన్నాయని, 2016 సం.లో సత్తుపల్లి మండల తహసీల్దార్ భూసేకరణ చట్టం 2013 ప్రకారం రూపొందించిన 258 మంది అర్హుల జాబితాను, కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే టైపిస్ట్ చేత రికార్డుల నుండి మాయం చేశారని గ్రామస్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

Also Read: Hyd Rain Updates: భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం.. ట్రాఫిక్ జామ్ ఏరియాలు ఇవే!

యువకుడి న్యాయపోరాటం..ప్రతీకార చర్యలు

వివాహిత యువతులకు మహిళలకు జరుగుతున్న అన్యాయంపై గ్రామంలోని ఓ యువకుడు న్యాయపోరాటం ప్రారంభించాడు. అయితే దళారి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ యువకుడిపై గ్రామంలోని తన అనుచరుల చేత అధికారులకు తప్పుడు ఫిర్యాదులు పెట్టించాడని, విచారణాధికారులకు కక్ష సాధింపు స్టేట్మెంట్లు ఇచ్చేలా ఒత్తిడి చేశాడని గ్రామంలో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా న్యాయం దక్కేనా?

జేవిఆర్ఓసి-2 ప్రాజెక్ట్ కోసం జరిగిన భూసేకరణలో భూములు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన వారికి చట్టం ప్రకారం అర్హుల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, కొంతమంది ప్రభావశీలుల ప్రేరేపణతో అధికారులచే జాబితా నుండి తొలగించబడ్డారని, భూసేకరణ చట్టం ప్రకారం వారికి రావలసిన నష్టపరిహారం అందకపోవడంతో, నేటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధిత యువతులు న్యాయం కోసం పోరాడుతున్నారని “ఏడేళ్లు గడిచినా వారి సమస్య పరిష్కారం కాలేదని, చట్టం ప్రకారం వారికి రావలసిన నష్టపరిహారం ఇప్పటికైనా ఇవ్వాలని” బాధిత యువతులు / మహిళలు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఖాళీ ప్లాట్లపై అక్రమ కబ్జాలు

2018లో ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద 229 మందికి రెండు కుంటల చొప్పున ఇండ్ల స్థలాలు మంజూరు చేయగా, మొత్తం 244 ప్లాట్లలో 15 ప్లాట్లు ఖాళీగా మిగిలాయి. వీటిలో 12 ప్లాట్లు అప్పట్లో అర్హత లేనివారిగా కలెక్టర్ గుర్తించిన వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్లాట్లను రికవరీ చేసి, ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించాలి” అని నూతన సబ్ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read: Liquor Shop Robbery: మద్యానికి బానిసై తండ్రి మృతి.. కోపంతో 8 లిక్కర్ షాపులు దోచేసిన తనయుడు!

కలెక్టర్ల నివేదికలు.. అనర్హుల జాబితా స్పష్టత

నవంబర్,2020 అప్పటి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ విచారణలో భాగంగా 13 మందిలో 12 మంది అనర్హులని, కేవలం మహమ్మద్ ముంతాజ్ అన్సారీ మాత్రమే అర్హుడని ఆర్ & ఆర్ కమిషనర్‌ హైదరాబాద్‌కు నివేదిక సమర్పించారు. జనవరి,2025 ప్రస్తుత కలెక్టర్ ముజామిల్ ఖాన్ కూడా ఇదే నివేదికను విచారణలో భాగంగా ఆర్ & ఆర్ కమిషనర్‌ హైదరాబాద్‌కు సమర్పించారు.

ఫోర్జరీ సంతకం..కోర్టు కేసు

(మస్జిద్ గురువు) మహమ్మద్ ముంతాజ్ అన్సారీ మొదటి జాబితాలో తన పేరును తొలగించి, మరోకరి పేరును చేర్చి అన్యాయం చేశారని ఆరోపిస్తూ, న్యాయం కోసం 2018 నుండి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమయంలో తన అనుమతి లేకుండా ఓ తెలియని అడ్వకేట్ ద్వారా తన పేరుతో ఫోర్జరీ సంతకం చేసి 2021లో WP 1174/2021 కేసు వేశారని, దీని వల్ల తన ఆర్ & ఆర్ ప్యాకేజీ 7 ఏళ్లుగా నిలిచిపోయిందని ఆయన వాపోతున్నారు.

మీడియా ద్వారా విజ్ఞప్తి

తనకు జరిగిన అన్యాయాన్ని ముస్లిం సోదరులు అర్థం చేసుకొని న్యాయ సహాయం చేయాలని, తనకి తెలియని అడ్వకేట్ ద్వారా వేసిన WP 1174/2021 కేసులో తన పేరును విత్‌డ్రా చేసుకునేలా చేయాలని మహమ్మద్ ముంతాజ్ అన్సారీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

Also Read: India on Pak Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ కారు కూతలు.. దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన భారత్!

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ