Dharna at Medak (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Dharna at Medak: పోటీ స్కూళ్ల విద్యా విధానాన్ని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాలి

Dharna at Medak: కేంద్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ(Pre-primary), పీఎం శ్రీ(PM Shri) పోటీ స్కూళ్ళ విద్యను తీసుకొచ్చి అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేస్తుందని, అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయాలని, ఐసిడిఎస్(ICDS) కు సంబంధంలేని బిఎల్ఓ లాంటి అదనపు పనులు అంగన్వాడీలతో చేయించకూడదని, విద్య వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి, అనంతరం ఎమ్మెల్యే పిఏ వెంకటేశంకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేశం మాట్లాడుతూ దేశంలో 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కీలక పాత్ర పోషిస్తురన్నారు. ఈ వ్యవస్థ ఏర్పడినప్పటి 40 సంవత్సరాలు నుంచి ఐసిడిఎస్ విధులే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక రకాల సంక్షేమ పథకాల అమలులో, ఎన్నికల నిర్వహణ లాంటి అనేక పనులు సమర్థవంతంగా అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ నిర్వహిస్తురన్నారు.

నిర్వీర్యం చేయడంలో భాగమే

ఐసిడిఎస్ పనులే కాకుండా, ఇతర శాఖల బిఎల్ఓ లాంటి ఐసిడిఎస్ కు సంబంధంలేని పనులు నిర్వహించడం వలన, ఐసిడిఎస్ పనుల నిర్వహణలో అనేక ఇబ్బందులు వస్తున్నప్పటికీ, అంగన్వాడి టీచర్లు మరియు హెల్పర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కోటి విద్యా కేంద్రాలను తెస్తూ, అంగన్వాడి కేంద్రాలను ఎత్తేసే యోచనలో ఉందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రైమరీ, పిఎంశ్రీ పథకం పేరుతో ప్రత్యేక వాలంటీర్లను నియమించి అదనపు కేంద్రాలను నిర్వహించాలనుకోవడం చూస్తే అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేయడంలో భాగమేనన్నారు . రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను కాపాడుకోకుండా, కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెచ్చే నూతన ప్రైమరీ విద్యా విధాన పథకానికి మద్దతునిస్తుందని దుయ్యబుట్టారు. నూతన విద్యా విధానాన్ని దేశంలో అమలు చేస్తే అంగన్వాడీ కేంద్రాలు కనుమరుగయ్యే అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Mahesh Kumar Goud: గత రేవంత్ రెడ్డి వేరు..ఇప్పుడు వేరు: మహేష్​ కుమార్ గౌడ్

పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ప్రజలలో చేరువయ్యే అవకాశం ఉండదని అసహనం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి వల్ల ప్రజలు పోషకాహార లోపంతో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చే నూతన ప్రీ ప్రైమరీ పియంశ్రీ పోటీ స్కూళ్లను తెలంగాణ రాష్ట్రంలో 200 సెంటర్లు మెదక్ జిల్లాలో 28 సెంటర్లు ఎంపిక చేసుకొని ప్రయోగాత్మకంగా ప్రభుత్వం అమలు మొదలుపెట్టిందన్నారు. ఐసిడిఎస్ లోనే అంగన్వాడి సెంటర్లను నిర్వహించాలన్నారు. నూతన విద్యా విధానం బాధ్యతను కూడా అంగన్వాడి కేంద్రాలకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఐసిడియస్ కు సంబంధంలేని బిఎల్ఓ, తదితర అదనపు పనులు అంగన్వాడీలతో చేయించకూడదన్నారు. విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అదనంగా అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ కు కూడా చెల్లించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలకు నష్టం కలిగించే నూతన ఫ్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యా విధానాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలన్నారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also Read: Rana Daggubati: మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రానా నుంచి ఏం తీసుకున్నారంటే?

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు