Trump on Gold Tariffs: రికార్డ్ స్థాయిలో పెరిగిన పసిడి రేటు..
Trump on Gold Tariffs ( IMAGE credit: twitter)
జాతీయం

Trump on Gold Tariffs: రికార్డ్ స్థాయిలో పెరిగిన పసిడి రేటు.. దిగుమతులపై టారిఫ్ ఉండదని స్పష్టం చేసిన ట్రంప్

Trump on Gold Tariffs: అమెరికా దిగుమతులపై ఈ మధ్య పలు దేశాలపై సుంకాలు విధిస్తున్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో కీలక ప్రకటన చేశారు. బంగారం(Gold)పై కూడా టారిఫ్‌లు విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో స్పందించిన ఆయన అలాంటిదేం ఉండదని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం అమెరికా కస్టమ్స్ ఒక ప్రకటన చేసింది. కేజీతోపాటు 100 ఔన్సుల(2.8 కేజీలు) బంగారు కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయని తెలిపింది. దాంతో బంగారంపై సుంకాలు విధిస్తారని తెగ ప్రచారం జరిగింది.

 Also Read: Jr NTR: ఎన్టీఆర్ స్పీచ్ వార్ 2 కి మైనస్ గా మారిందా..? సినిమా రిజల్ట్ డౌటే అంటున్న నెటిజన్స్?

బంగారంపై 39 శాతం సుంకం

దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గందరగోళం నెలకొన్నది. పసిడి ధర కూడా రికార్డ్ స్థాయిలో పెరిగింది. దీంతో ట్రంప్ ప్రకటన చేయాల్సి వచ్చింది. తాము దిగుమతి చేసుకునే బంగారం(Gold)పై సుంకాలు ఉండవన్నారు. మరోవైపు, స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై 39 శాతం సుంకం విధించాలని ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. స్విస్ సహా అనేక దేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం ఉత్పత్తులకు ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య